షాకింగ్: 267 మిలియన్ల ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం.. ‘డార్క్ ‌వెబ్’ చేతుల్లో!?

6:14 pm, Fri, 24 April 20
a massive data leak affecting 267 million facebook users

వాషింగ్టన్: 267 మిలియన్లకుపైగా ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత వివరాలు ‘డార్క్ వెబ్’ చేతుల్లోకి వెళ్లినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సోఫోస్’ తాజాగా బాంబు పేల్చింది. 

యూజర్ ఐడీలు, ఖాతాదారు పూర్తి పేరు, ఈ-మెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్లు, టైమ్ స్టాంప్ వివరాలు, రిలేషన్ షిప్ స్టేటస్, వయసు తదితర సమాచారం మొత్తాన్ని ‘డార్క్ వెబ్’కు విక్రయించారట. 

చదవండి: ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్యాక్.. ఒక్క‌సారి రీచార్జ్‌తో ఏడాదిపాటు డిస్నీ ప్లస్, హాట్ స్టార్ వీఐపీ ఉచితం!

ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ యూజర్లు వెంటనే తమ ఖాతాల భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకోవాలని, రెండంచెల పాస్ వర్డ్ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని.. లేకపోతే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారని హెచ్చరించింది.

ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకవడం అనేది కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలా ఎన్నో ఉదంతాలు జరిగాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంలోనూ ఫేస్‌బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అయితే మళ్లీ ఆ స్థాయిలో.. ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం తాజాగా లీకైనట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌లోని థర్డ్ పార్టీ ఏపీఐ లోపాలను ఆధారంగా చేసుకుని ఈ డేటాను తస్కరించి ఉండొచ్చని మరో సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. 

ఏమిటీ ‘డార్క్ వెబ్’…

‘డార్క్ వెబ్’ అనేది ఎన్‌క్రిప్షన్ చేయబడిన వెబ్ సైట్ డేటా లేదా రహస్య సంకేతాలతో కూడిన ఆన్‌లైన్ కంటెంట్. వీటిని ‘డార్క్‌నెట్’ అని కూడా పిలుస్తారు. 

ఎందుకంటే..ఇలాంటి వెబ్‌సై‌ట్‌లు సాధారణ సెర్చ్ ఇంజిన్లలో కనిపించవు. వీటి డొమైన్లు కూడా సంఖ్యలు, సంజ్ఞలు, ఇతర రహస్య సంకేత నామాలతో కూడి ఉంటాయి.

ప్రత్యేకంగా వాటి నిర్వాహకుల నుంచి ‘కీ’ లభిస్తే, దాని సాయంతో ఆ సైట్‌ను వీక్షించవచ్చు. సబ్ స్క్రైబర్లకు మాత్రమే వాటిని చూసే అనుమతి ఉంటుంది. 

చదవండి: ‘జూమ్’కి గట్టి పోటీ ఇస్తోన్న ‘గూగుల్ ‘.. కొత్త యాప్‌లో ఒకేసారి 16 మందితో వీడియో కాన్ఫరెన్స్!