కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు.. బీఎస్ఎన్ఎల్, జియో నుంచి భలే ఆఫర్లు…

1 week ago
bsnl-jio-new-broadband-plans-and-data-offers-for-work-from-home-employees

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని (వర్క్ ఫ్రం హోమ్) చేయాలని సూచిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు అందరూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

చదవండి: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న‘కరోనా’.. కొత్తగా ఏపీలో 2, తెలంగాణలో 1 పాజిటివ్ కేసు…

ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనిపేరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్. దీని కాలపరిమితి 51 రోజులు. రీచార్జ్ ధర రూ.251. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు వినియోగదారులు 2 జీబీ డేటా పొందవచ్చు. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. కాల్స్, మెసేజింగ్ చేసుకోవడం కుదరదు.

బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ఏమిటంటే…

కరోనా కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా కనెక్షన్లు తీసుకున్న వారికి నెలరోజుల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వర్క్ ఫ్రం హోమ్ పెరుగుతుండడంతో ఈ పరిస్థితి కారణంగా తమకు మరిన్ని కొత్త కనెక్షన్లు వస్తాయని బీఎస్ఎన్ఎల్ అంచనా వేస్తోంది. అందుకే కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రీ బ్రాడ్‌బ్యాండ్ అంటూ సరికొత్త ప్లాన్ ప్రకటించింది.

చదవండి: జనతా కర్ఫ్యూ: రేపు అన్నీ స్వచ్ఛందంగా బంద్ చేయండి.. అవసరమైతే తెలంగాణ షట్‌డౌన్‌: సీఎం కేసీఆర్

ఇప్పటికే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉన్న వారు కొత్తగా బ్రాండ్ బ్యాండ్ సౌకర్యం కావాలనుకుంటే ఈ ఆఫర్ తీసుకోవచ్చు. ఇన్‌స్టలేషన్ చార్జీలు కూడా వసూలు చేయరు. అయితే వినియోగదారులు ఇంటర్నెట్ మోడెమ్‌ను మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

దీనిపై బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ స్పందిస్తూ, తమ కొత్త ప్లాన్‌తో ఉద్యోగులు ఇంటి నుంచి బయటికి రాకుండానే పని చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉన్నవారికి, కొత్తగా కనెక్షన్ తీసుకున్న వారికి ఉచితంగా ఒక నెల పాటు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. 

చదవండి: కరోనా అప్‌డేట్: దేశంలో 258కి పెరిగిన పాజిటివ్ కేసులు, ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే…