ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్యాక్.. ఒక్క‌సారి రీచార్జ్‌తో ఏడాదిపాటు డిస్నీ ప్లస్, హాట్ స్టార్ వీఐపీ ఉచితం!

3:40 pm, Fri, 24 April 20
Airtel offers New Rs.401 Prepaid Plan with Disney Plus and Hotstar VIP Free for an Year

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌లో ప్రస్తుతం ఇళ్లకే పరిమితమైన కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వినోదం అందించేందుకు ఎయిర్ టెల్ ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌ను ప్రకటించింది.

రూ.401 విలువైన ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌తో రీచార్జ్ చేసుకున్న వారు రోజుకు 3 జీబీ డేటాను 28 రోజులపాటు వాడుకోవచ్చు. ఇది ఓన్లీ డేటా ప్లాన్ మాత్రమే. ఈ రూ.401 రీచార్జ్ ప్యాక్‌లో కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు ఉండవు.

చదవండి: ‘జూమ్’కి గట్టి పోటీ ఇస్తోన్న ‘గూగుల్ ‘.. కొత్త యాప్‌లో ఒకేసారి 16 మందితో వీడియో కాన్ఫరెన్స్!

అయితే మాకేంటి లాభం అంటారా? అక్కడికే వస్తున్నాం ఆగండి. ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌తో రీచార్జ్ చేసుకున్న వారికి ఏడాది పాటు డిస్నీ ప్లస్, హాట్ స్టార్ వీఐపీ ఉచితం. ఇదీ అసలు ఎగిరి గంతేయాల్సిన వార్త. 

నిజానికి విడిగా కొంటే.. డిస్నీ ప్లస్, హాట్ స్టార్ వీఐపీ ప్యాక్ ఏడాది చందాయే రూ.399 ఉంటుంది మరి. దీనికి జస్ట్ ఇంకో రూ.2 పెట్టుకుంటే.. 28 రోజులపాటు రోజుకు 3 జీబీ డేటా వస్తుంది కదా.. ఏమంటారు?

ఇటీవలి కాలంలో పలు ఇంగ్లీష్ సినిమాలను, ముఖ్యంగా పిల్లలు ఇష్టపడే చిత్రాలను డిస్నీ ప్లస్, హాట్ స్టార్ అందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం టైటిల్స్‌ను వీఐపీలో, ఇంగ్లీష్ టైటిల్స్‌ను ప్రీమియం ద్వారా అందిస్తోంది.

ప్యాక్ గడువు ముగిసినా ఏడాది పాటు…

ఇక్కడే మరో అదనపు సౌకర్యం కూడా ఉంది. మీరు ఈ రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్‌ ఒక్కసారి వేయించుకుంటే చాలు.. ఆ తరువాత మీరు కాలింగ్, మెసేజింగ్ సదుపాయాలు ఉండే మరో ప్లాన్ వేయించుకున్నా ఆ ఏడాదంతా అవి ఫ్రీ.

ఇక ఎయిర్ టెల్ రూ.398 ప్రీ పెయిడ్ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ చందా ఉచితంగా లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు కూడా ఉంటాయి.