దీపావళి సేల్‌కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఆఫర్ల హోరు

1:32 pm, Wed, 9 October 19

న్యూఢిల్లీ: బిగ్‌బిలియన్ డేస్ సేల్ ఇలా ముగిసిందో, లేదో మరో సేల్‌కు ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌కు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి ‘బిగ్ దివాలీ సేల్’ పేరుతో ఆఫర్లకు తెరతీయనుంది. అక్టోబరు 12న అర్ధరాత్రి నుంచి సేల్ ప్రారంభం కానుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు 11న రాత్రి 8 గంటలకు అందుబాటులోకి రానుంది.

భారతీయ స్టేట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్.. ఆ బ్యాంకు క్రెడిట్‌కార్డ్ యూజర్లకు 10 శాతం తక్షణ రాయితీ ప్రకటించింది. అలాగే, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బండిల్డ్ మార్పిడి ఆఫర్లు, ఎంపిక చేసిన మొబైళ్ల ప్రొటెక్షన్ ప్లాన్లపైనా ఆఫర్లు ప్రకటించింది.

టాప్ మొబైల్ బ్రాండ్లపై రాయితీలు కూడా ఆఫర్ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్.. కొద్దిపాటి చెల్లింపుతో బై బ్యాక్ గ్యారెంటీని కూడా ప్రకటించింది. రెడ్‌మి 7 ప్రొ, రెడ్‌మి నోట్ 7ఎస్, రియల్ 5, వివో జడ్1 ప్రొ, రియల్‌మి సీ2పైనా డీల్స్ ప్రకటించింది. అలాగే, మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపైనా బిగ్ డీల్స్ ప్రకటించే అవకాశం ఉంది.

స్మార్ట్‌ఫోన్లపై రాయితీలతోపాటు టీవీలు, అప్లయెన్సెస్ కేటగిరీలో 50 వేల ఉత్పత్తులపై 75 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో టాప్ సెల్లింగ్ ప్రొడక్టులపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందులో హెడ్‌ఫోన్లు, స్పీకర్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఉత్పత్తులు ఉన్నాయి.