అదిరిపోయే ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ షాపింగ్ డేస్ సేల్’

10:21 pm, Thu, 9 May 19

ముంబై: అదిరిపోయే ఆఫర్లు ఇస్తూ వినియోగదారులని ఆకర్షిస్తున్న దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్….మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనున్నట్టు తెలిపింది.

ఈ ఆఫర్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఇక వీటితోపాటు గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, గార్మెంట్లు వంటి వాటిపైనా ఆఫర్ల వాన కురిపించనుంది. ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా ఈ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వనుంది.

చదవండి: ఓలా, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డుల గురించి విన్నారా…??

పేటీఎంలో శాంసంగ్ సూప‌ర్ సేల్‌..

పేటీఎంలో శాంసంగ్ సూప‌ర్ సేల్‌ నడుస్తుంది. శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎస్‌10 512 జీబీ వేరియెంట్‌పై రూ.14వేలు, గెలాక్సీ ఎస్10ఇ ఫోన్‌పై రూ.9వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తున్నారు. అలాగే గెలాక్సీ ఎస్10 సిరీస్‌లో ఇత‌ర వేరియెంట్లపై కూడా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫర్ల‌ను ఇస్తున్నారు.

చదవండి: తక్కువ ధరకే జెడ్‌టి‌ఈ కొత్త స్మార్ట్‌ఫోన్….షియోమీ నుంచి కొత్త గేమింగ్ ఫోన్