అటు అమెజాన్.. ఇటు ఫ్లిప్‌కార్ట్, వినియోగదారులకు ఇక పండగే…

2 weeks ago

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు ఫ్లిప్‌కార్ట్-అమెజాన్‌లు మరోమారు భారీ ఆఫర్లతో హోరెత్తిస్తున్నాయి. రెండు సంస్థలు ఒకే రోజుల్లో సేల్‌ను ప్రకటించాయి. ‘గ్రేట్ ఇండియన్ సేల్’ పేరుతో అమెజాన్ ఇది వరకే సేల్ ప్రకటించగా, తాజాగా ఫ్లిప్‌కార్ట్ ‘రిపబ్లిక్ డే సేల్’ను ప్రారంభించింది.

ఈ నెల 19 నుంచి 22 వరకు ఈ సేల్ కొనసాగనుంది. అవే రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కూడా ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా ‘బ్లాక్‌బస్టర్ డీల్స్’, ‘రష్ అవర్స్’, ‘ప్రైస్ క్యాష్’ వంటి వాటిని కూడా ఆఫర్ చేస్తోంది.

‘రెడ్‌మి 8ఎ’ను రూ.5,999కి, ‘మోటొరోలా వన్ యాక్షన్’ను రూ.8,999కి అందుబాటులో ఉంచింది. వీటి అసలు ధరలు వరుసగా రూ.6,499, రూ.10,999.

‘ఐఫోన్ 7’, 32 జీబీ స్టోరేజీ వేరయంట్ ధరను రూ.27,999 నుంచి రూ.24,999కి తగ్గించింది. ‘రియల్‌మి 3’ అసలు దర రూ.7,499 కాగా, ఇప్పుడు దానిని రూ.6,999కి తగ్గించింది.

‘మోటోరోలా వన్ విజన్’ 128 జీబీ వేరియంట్‌ను రూ.14,999 నుంచి రూ.13,999కి తగ్గించగా, ‘లెనోవో ఎ6 నోట్’ 3జీబీ ర్యామ్+32జీబీ వేరియంట్‌ను రూ.5,499కి తగ్గించింది. ‘మోటో ఈ6ఎస్’ 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీని రూ.6,499కి అందుబాటులో ఉంచింది.

వీటితోపాటు లెనోవో కె10 నోట్, ఆసుస్ 5జడ్, ఆసుస్ మ్యాక్స్ ఎం2, ఆనర్ లైట్ తదితర స్మార్ట్‌ఫోన్ల ధరలపైనా భారీ రాయితీలు ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎలక్ట్రానిక్ యాక్సెసరీలపై 80 శాతం వరకు, స్మార్ట్‌వాచ్‌లపై 50 శాతం వరకు, హెడ్‌ఫోన్లపై 70 శాతం వరకు, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 వరకు రాయితీ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులు, కోటక్ మహింద్ర బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ రాయితీ లభించనుంది.