మళ్లీ భగ్గుమన్న బంగారం ధర.. రెండు రోజుల్లో రూ. 1500 పెరుగుదల

- Advertisement -

ముంబై: బంగారం, వెండి ధరలు మళ్లీ కొండెక్కాయి. గతవారం దిగివచ్చిన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత రెండు రోజుల్లో 10 గ్రాముల బంగారం రూ. 1500 పెరగ్గా, కిలో వెండి ధర ఏకంగా రూ. 3 వేలు పెరిగింది.

డాలర్‌ బలహీనపడటంతో పాటు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు బంగారానికి డిమాండ్‌ పెంచాయి. కరోనా కేసుల పెరుగుదలతో కూడా ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారని బులియన్‌ నిపుణులు పేర్కొన్నారు.

- Advertisement -

ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల బంగారం రూ. 645 పెరిగి రూ. 53,920కు చేరుకుంది. కిలో వెండిపై రూ. 1978 పెరిగి మళ్లీ రూ. 70 వేల మార్క్‌ దాటి రూ. 71,133కు చేరుకుంది.

అమెరికన్‌ డాలర్‌ ఈ వారం కనిష్ట స్థాయిలో పతనమవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 2000 డాలర్ల మార్క్‌ను తిరిగి చేరాయి.

హువావే టెక్నాలజీస్‌పై అగ్రరాజ్యం అమెరికా తాజా ఆంక్షలతో అమెరికా-చైనా ఉద్రిక్తతలు పెరగడం పసిడి డిమాండ్‌ను పెంచింది.

 

- Advertisement -