ఐదు రోజుల పసిడి పరుగుకు కళ్లెం.. తగ్గిన ధర, వెండి కూడా అదే బాటలో…

4 days ago

న్యూఢిల్లీ: ఐదు రోజుల పసిడి ధరకు ఈ రోజు బ్రేక్ పడింది. గత సెషన్‌లో కొద్దిగా పెరిగిన బంగారం ధర ఆ తర్వాత పడిపోయింది. ఎంసీఎక్స్, ఏప్రిల్ గోల్డ్ ఫీచర్స్‌ 0.75 శాతం క్షీణించి 10 గ్రాములకు రూ.41.900కు చేరుకుంది.

జూన్ ఫీచర్స్ 0.4 శాతం పడి రూ.42,650గా నమోదైంది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఎంసీఎక్స్‌లో 1.7 శాతం క్షీణించి కిలోకు రూ.41,003కు పడిపోయింది.

ఏప్రిల్ గోల్డ్ ఫీచర్స్ దాదాపు 2 శాతం అంటే 10 గ్రాములకు రూ.800 పెరిగింది. కాగా, ఈ నెల మొదట్లో బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 45 వేలకు తాకిన తర్వాత ధరల్లో కొంత అస్థిరత కనబడింది.

గ్లోబల్ మార్కెట్లోనూ…

మరోవైపు, గ్లోబల్ మార్కెట్లోనూ బంగారం ధరలు పడిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగులు పెరిగే అవకాశాలు ఉందన్న ఊహాగానాలకు తోడు, పెట్టుబడిదారులు నగదుకోసం పరుగులు పెట్టడంతో బంగారం ధరలు గురువారం పడిపోయాయి.

స్పాట్ బంగారం ధర ఔన్సుకు 0.6 శాతం పడిపోయి 1,604.16 డాలర్లకు చేరుకుంది. ఇతర లోహాలలో వెండి ఔన్సుకు 0.4 శాతం తగ్గి 14.37 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 1.6 శాతం పడిపోయి 726.48 డాలర్లకు చేరుకుంది.