దిగొస్తున్న బంగారం.. భారీగా పడిపోయిన వెండి ధర

10:30 pm, Thu, 4 June 20
gold price is far away from middle class running towards 50k

న్యూఢిల్లీ: అడ్డూఅదుపు లేకుండా పెరుగుతూ పోతున్న పసిడి ధరకు నేడు బ్రేకులు పడ్డాయి. వరుసగా రెండో రోజు పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర తగ్గినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి. 

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.390 తగ్గి రూ.44,680కు చేరుకుంది.  24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.390 క్షీణించి రూ.48,780కు దిగొచ్చింది.

మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1260 తగ్గి రూ.48,900కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణమని బులియన్ వర్గాలు తెలిపాయి. 

 అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.04 శాతం దిగొచ్చింది. దీంతో ధర ఔన్స్‌కు 1704 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.01 శాతం తగ్గుదలతో 17.95 డాలర్లకు పడిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర భారీగానే పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.500 తగ్గి రూ.45,450గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,650గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.1260 తగ్గుదలతో రూ.48,900కు పడిపోయింది.