‘కరోనా’ ఈ బిజినెస్‌ మ్యాన్‌కి కాసులు కురిపించింది! గంటకు ఎన్ని కోట్ల సంపాదన అంటే…

1:12 pm, Sat, 25 April 20
Singapore Business Man Li Xiting

షెంజెన్: కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంటే.. పెద్ద పెద్ద కంపెనీలే మూత పడుతోంటే.. సింగపూర్‌లోని ఓ బిజినెస్ మ్యాన్‌కి మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.

నెలకు బిలియన్ డాలర్లు వచ్చి పడుతుండడంతో స్టాక్ మార్కెట్‌లో ఆయన కంపెనీ స్టాక్ ధర ఏకంగా 50 శాతం పెరిగింది. ప్రస్తుతం సింగపూర్‌లో ఆయన అత్యంత సంపన్నుడిగా ఆవిర్భవించాడు.

చదవండి: షాకింగ్: 267 మిలియన్ల ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం.. ‘డార్క్ ‌వెబ్’ చేతుల్లో!?

ఆయన పేరు లీ జిటింగ్. సింగపూర్‌లోని షెంజెన్ మైండ్‌రే బయో మెడికల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు. పుట్టింది చైనాలో అయినా.. ఆయన సింగపూర్ వెళ్లి అక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.

అన్ని వాపారాలు పడుకుంటుంటే…

కరోనా వైరస్ కారణంగా అన్ని వాపారాలు పడుకుంటుంటే.. లీ జిటింగ్ వ్యాపారం మాత్రం మూడు పూవులు, డజను కాయలు అన్న చందంగా మారింది. దీనికి కారణం – ఆయన చేస్తున్న వ్యాపారం వైద్య పరికరాలకు సంబంధించినది కావడం.

సింగపూర్‌కు చెందిన షెంజెన్ మైండ్‌రే బయో మెడికల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వెంటిలేటర్లు సహా ఇతర వైద్య పరికరాలను తయారు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోగులు పెరుగుతుండడంతో వెంటిలేటర్ల అవసరం కూడా పెరిగింది. 

ఈ పరిస్థితులు లీ జిటింగ్‌కు బాగా కలిసొచ్చాయి. ఆయన ఈ ఏడాది ప్రతి 24 గంటలకు రూ.287 కోట్లు సంపాదించాడు. అంటే గంటకు రూ.12 కోట్ల సంపాదన అన్నమాట.

చదవండి: కరోనా భయంతో ఆటోలో పార్టిషన్.. ఆ ఆటో డ్రైవర్‌కు ఆనంద్ మహీంద్రా సూపర్ ఆఫర్!

ప్రస్తుతం షెంజెన్ మైండ్‌రే కంపెనీకి 100కుపైగా దేశాల నుంచి వివిధ వైద్య పరికరాల కోసం ఆర్డర్లు వచ్చాయి. ఒక్క ఇటలీ నుంచే 10 వేల వెంటిలేటర్ల ఆర్డర్ వచ్చింది.

ఇన్నాళ్లూ చేసిన వ్యాపారం ఒకెత్తు అయితే ఇప్పుడు కరోనా కాలంలో ఆయన చేస్తున్న వ్యాపారం ఒకెత్తు. దీంతో లీ జిటింగ్‌ నికర సంపద విలువ ఒక్కసారిగా రూ.32,777 కోట్లు నుంచి రూ.1,02,905 కోట్లకు పెరిగింది.