దారుణంగా పడిపోయిన రూపాయి మారకపు విలువ.. డాలర్‌తో పోలిస్తే ఇప్పుడెంతంటే…

10:35 am, Wed, 22 April 20

ముంబై: అమెరికా డాలర్‌తో రూపాయి మారకపు విలువ ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో గందరగోళం, ఈక్విటీ మార్కెట్లు స్వదేశానికి తిరిగి రావడంతో నిన్న రూపాయి విలువ దారుణంగా పడిపోయింది.

గ్రీన్‌బ్యాక్‌కు వ్యతిరేకంగా 76.79 వద్ద  రోజును ప్రారంభించిన తరువాత రూపాయి 76.60-76.84 మధ్య ఊగిసలాడింది.

నాలుగు గంటల సెషన్‌లో బలహీనమైన స్థాయిలో ఆల్-టైమ్ కనిష్టానికి మూడు పైసల్లోకి వచ్చేసింది.

గత వారం రూపాయి 76.87కు పడిపోయింది. అమెరికా కరెన్సీకి వ్యతిరేకంగా నమోదైన అత్యంత కనిష్ట స్థాయి ఇదే కావడం గమనార్హం.

చదవండి: ‘జూమ్‌’కు పోటీ యాప్ తయారు చేస్తే కోటి రూపాయల నజరానా: ప్రకటించిన కేంద్రం