బ్రిటన్ కొత్త ఆర్థిక మంత్రిగా.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు!

10:02 am, Fri, 14 February 20
uk-new-finance-minister-rishi-sunak

బ్రిటన్‌: యూకే ఆర్థికమంత్రిగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ (39) నియమితులయ్యారు. బ్రిటన్‌ ఆర్థికమంత్రి  సాజిద్‌ జావిద్‌ అనూహ్య రాజీనామా అనంతరం ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఈ మేరకు రిషి సునక్ నియామకాన్ని ఖరారు చేశారు.   

చదవండి: ఏపీ ‘మూడు రాజధానుల’పై షకీలా పంచ్.. వచ్చేసిన ట్రైలర్

హోంశాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్రీతి పటేల్‌‌ను, అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న అలోక్ శర్మ(51)ను తన కొత్త మంత్రివర్గంలోనూ కొనసాగించిన ప్రధాని జాన్సన్.. తాజాగా తన క్యాబినెట్‌లో భారీ మార్పులు చేశారు. ఈ మార్పులను ఆయన ఒక ట్వీట్‌ ద్వారా షేర్‌  చేశారు.  

2015 నుండి రిచ్‌మండ్‌కు ఎంపీగా…

రిషి సునక్‌ యూకేలోని హాంప్‌షైర్‌లో జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్, ఫార్మాసిస్ట్. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ చదివారు. అనంతరం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 2015 నుండి రిషి యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌కు ఎంపీగా ఉన్నారు.

గతేడాది ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా కూడా ఎంపికయ్యారు. అంతకుముందు రిషి జూనియర్ మినిస్టర్‌గా కూడా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు రిషి సునక్ పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ శాచ్ కంపెనీలో విశ్లేషకుడిగానూ సేవలు అందించారు. 

చదవండి: విదేశాల్లో యువతీయువకులు.. ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం.. వీడియో వైరల్

2009లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు. అక్షతతో ఆయనకు స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోనే పరిచయం ఏర్పడింది. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.