వినియోగదారులకు శుభవార్త చెప్పిన జియో…

8:08 am, Tue, 14 May 19

ముంబై: టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో సంస్థ…. తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జియో ప్రైమ్ సభ్యత్వాన్ని సంవత్సరం పాటు పొడిగిస్తూ రిలయన్స్ జియో నిర్ణయం తీసుకుంది.

దీంతో జియో ప్రైమ్ సభ్యత్వం ఉన్నవాళ్లు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేకుండానే ఏడాదిపాటు ప్రైమ్ సేవల కొనసాగింపు పొందవచ్చు . గతంలో కూడా జియో ప్రైమ్ మెంబర్ షిప్‌ను ఉచితంగానే ఇచ్చారు.

చదవండి: అదిరిపోయే ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ షాపింగ్ డేస్ సేల్’
ఇక దీని ద్వారా వినియోగదారులు జియో యాప్స్.. జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్‌ను ఫ్రీగా యాక్సస్ చేసుకోవచ్చు .

అయితే జియో ప్రైమ్ సభ్యులు తమ మై జియో యాప్ లోకి  వెళ్ళి ఆఫర్ తమకు అందుబాటులోకి వచ్చిందీ లేనిదీ తెలుసుకోవచ్చు. నిజానికి జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం వినియోగదారులు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ వల్ల ఉచితంగానే ఏడాదిపాటు ప్రైమ్ మెంబర్‌షిప్ ఆటో రెన్యువల్ అవుతుంది.

చదవండిఓలా, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డుల గురించి విన్నారా…??