‘కరోనా’పై పోరుకు కదిలొచ్చిన ‘ఒప్పో’.. పీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం

6:50 pm, Sun, 29 March 20

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరులో చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో కూడా చేయి కలిపింది. ప్రధానమంత్రి సహాయనిధి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించింది.

ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ సేవలు కొనసాగిస్తున్న వారికి సెల్యూట్ చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఒప్పో పేర్కొంది. వారు పనిచేస్తున్న కారణంగా తాము ఇంట్లో క్షేమంగా ఉండగలుగుతున్నామని, అత్యవసర సేవలు కొనసాగుతున్నాయని తెలిపింది.

‘‘ఇదో చిన్న అడుగు మాత్రమే..’’

ఈ క్రమంలో తమ వంతు సాయంగా పీఎం సహాయనిధి, యూపీ సీఎం సహాయనిధికి కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించినట్టు పేర్కొంది.

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ముందుండి పోరాడుతూ ప్రజలకు వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతాభావాన్ని చూపించడానికి ఇది చిన్న అడుగు మాత్రమేనని ఒప్పో వివరించింది.

చదవండి: భారత్‌లో కరోనా: ఇప్పటి వరకు 29 మంది మృతి, పాజిటివ్ కేసులు 1071…
చదవండి: కరోనా కాటుకు చిగురుటాకులా వణుకుతున్న అగ్రరాజ్యం
చదవండి: ఒకే రోజు ఆరుగురి మృతి .. దేశంలో 25కు చేరిన కరోనా మరణాలు
చదవండి: చిన్న దేశం.. వైద్య సౌకర్యాలూ అంతంతమాత్రం.. కానీ ‘కరోనా’పై గెలుపు సాధించింది!
చదవండి: కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు.. బీఎస్ఎన్ఎల్, జియో నుంచి భలే ఆఫర్లు…
చదవండి: బాలీవుడ్ సింగర్ కనికకు మూడోసారి కూడా కరోనా పాజిటివ్