మళ్ళీ మొదలు: చైనా-అమెరికా ట్రేడ్ వార్…

10:00 am, Wed, 8 May 19
trade war between usa and china

వాషింగ్టన్: అగ్రరాజ్యాలు చైనా-అమెరికాల మధ్య మళ్ళీ ట్రేడ్ వార్ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతోనే ఈ వాణిజ్య యుద్ధం మళ్ళీ తెరపైకి వచ్చింది.  శుక్రవారం(మే10) నుంచి అమెరికాలో దిగుమతయ్యే చైనాకి చెందిన 200 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై ట్యాక్స్ పెంచుతామని ట్రంప్ ఆదివారం హెచ్చరించారు.

ట్రంప్ ప్రకటన ప్రకారం ప్రస్తుతం 10 శాతంగా ఉన్న సుంకాలని 25 శాతానికి పెంచనున్నారు.  అలాగే గడిచిన 10 నెలలుగా 50 బిలియన్ డాలర్ల విలువైన హై టెక్ ఉత్పత్తులపై 25 శాతం, 200 బిలియన్ డాలర్ల విలువైన ఇతర ఉత్పత్తులపై 10 శాతం సుంకాలను అమెరికాకు చైనా చెల్లిస్తున్నదని తెలిపారు.

చదవండి: కారు విమానంలో వస్తోందట.. అడ్డంగా మోసపోయిన హైదరాబాదీ!

అయితే ఈ 10 శాతం సుంకాలను శుక్రవారం నుంచి 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే చైనా నుంచి అమెరికాకు వస్తున్న ఇంకా 325 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు లేవని ట్రంప్ గుర్తుచేశారు. త్వరలోనే వీటిపైనా 25 శాతం పన్నులను విధిస్తామని ట్రంప్ చెప్పడం గమనార్హం.

సయోధ్య వైపే మొగ్గు చూపుతున్న చైనా….

ట్రంప్ ఈ స్థాయిలో సుంకాలని పెంచుతామని హెచ్చరించిన….చైనా మాత్రం అమెరికాతో సయోధ్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కాలు పెంచకుండా ఉండేందుకు తమ దేశానికి చెందిన వాణిజ్య దౌత్య ప్రతినిధిని అమెరికాకు చర్చల కోసం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. సుం మరి ఈ చర్చలు సఫలం అవుతాయో విఫలమవుతాయో చూడాలి.

చదవండిఒకరిపై ఒకరు రాకెట్ల దాడి చేసుకుంటున్న ఇజ్రాయెల్-పాలస్తీనా…