వొడాఫోన్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటాతో…

7:06 pm, Wed, 15 January 20

న్యూఢిల్లీ: అపరిమిత వాయిస్ కాల్స్, హైస్పీడ్ డేటాతో ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.99, రూ.555తో తీసుకొచ్చిన ఈ ప్లాన్లు ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అపరిమిత వాయిస్ కాల్స్, హైస్పీడ్ డేటాతోపాటు జీ5 సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

చదవండి: వీయూ నుంచి సినిమా టీవీ.. షియోమీ, వన్‌ప్లస్‌కు గట్టి పోటీ!

రూ.99 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, 1జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్సెమ్మెస్‌‌ వంటి ప్రయోజనాలు 18 రోజుల కాలపరిమితితో లభిస్తాయి. రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు 70 రోజుల కాలపరిమితితో లభిస్తాయి.

వొడాఫోన్ రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం కోల్‌కతా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్ సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉండగా, రూ.555 వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ ఢిల్లీ, ఎన్‌సీఆర్, ముంబై సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

చదవండి: అటు అమెజాన్.. ఇటు ఫ్లిప్‌కార్ట్, వినియోగదారులకు ఇక పండగే…