నోకియా నుంచి నయా స్మార్ట్ టీవీ! 43 అంగుళాలే.. కానీ 55 అంగుళాల్లా…

6 days ago
nokia-first-43-inch-smart-tv

న్యూఢిల్లీ: అద్భుతమైన ఫీచర్లతో నోకియా నుంచి మరో స్మార్ట్ టీవీ వచ్చేస్తోంది. నోకియా బ్రాండ్ లైసెన్స్‌తో ఫ్లిప్‌కార్ట్ దీనిని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది.

43 అంగుళాలున్న ఈ స్మార్ట్‌టీవీలో జేబీఎల్ సౌండ్ స్టిస్టం ఉపయోగించారు. అయితే, అటు ఫ్లిప్‌కార్ట్ కానీ, ఇటు నోకియా కానీ ఇంతకుమించి స్పెసిఫికేషన్లు వెల్లడించలేదు.

అయితే, భారత్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 55 అంగుళాల వేరియంట్ మాదిరి అనుభూతినే ఈ 43 అంగుళాల టీవీ ఇస్తుందని భావిస్తున్నారు.

నోకియా అధికారిక వెబ్‌సైట్‌లో…

నోకియా అధికారిక వెబ్‌సైట్‌లో రాబోయే టీవీ ఇమేజ్‌ను ఉంచింది. ఇది అచ్చం 55 అంగుళాల టీవీ మోడల్‌ను పోలి ఉంది. ధర, లభ్యతకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

ఇక, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోకియా 55 అంగుళాల స్మార్ట్ టవీ ధర రూ. 41,999 మాత్రమే. 4కె స్మార్ట్ టీవీ అయిన ఇందులో ఆండ్రాయిడ్ 9 ఓఎస్‌ను ఉపయోగించారు.

ఎల్‌ఈడీ ప్యానెల్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ కావడంతో గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో వంటివి ఉన్నాయి. 12 వాట్స్ స్పీకర్ అమర్చారు. ఇప్పుడు రాబోయే 43 అంగుళాల మోడల్‌లోనూ ఇంచుమించు ఇవే స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉందని సమాచారం.