గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ.. ‘భారత్ క్రాఫ్ట్’ పేరుతో ఈ-కామర్స్ సైట్‌ను తీసుకొస్తున్న బ్యాంకు

- Advertisement -

ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్‌బ్యాంకు ఈ-కామర్స్ పోర్టల్‌ను తీసుకువచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమలు ఉత్ప‌త్తి చేసే వ‌స్తువుల అమ్మ‌కానికి ఈ పోర్టల్‌ను అందుబాటులో ఉంచనున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ తెలిపారు. దీనికి ‘భారత్ క్రాఫ్ట్’ గా పేరు పెట్టినట్టు చెప్పారు. బ్యాంకు, గ‌వ‌ర్న‌మెంట్ రెండూ కలిసి ఈ పోర్టల్‌ను నిర్వహించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

‘ఇప్పటికే పనులు మొదలయ్యాయి. పోర్టల్‌కు సంబంధించి విధి విధానాలు తుది దశకు చేరుకున్నాయి. ఫ్లాట్‌ఫాం రూపకల్పన పనులు త్వరలోనే మొదలవుతాయి’ అని రజ్‌నీష్ కుమార్ పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన ఒక వెబినార్‌లో ఆయన ఈ విషయాన్ని తెలియ‌జేశారు.

- Advertisement -

అయితే కొత్త ఈ-కామర్స్ పోర్టల్ ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తుందన్న వివ‌రాలు తెలియ‌రాలేదు. ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే ఎంఎస్ఎంఈలు వారి ఉత్ప‌త్తుల‌ను వారే సొంతంగా పోర్టల్‌లో అమ్ముకోడానికి వీలు క‌లుగుతుంది. దేశవ్యాప్తంగా ఈ-మార్కెట్ అందుబాటులోకి వస్తుంది.

- Advertisement -