అక్షయ తృతీయ ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు

8:46 pm, Wed, 8 May 19

న్యూఢిల్లీ: అక్షయ తృతీయ(మే 7న) రోజున స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు బుధవారం (8న) మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో బుధవారం బులియన్ మార్కెట్‌‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 180 రూపాయలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.32,670 నుంచి రూ.32,850కి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,500 నుంచి రూ.32,680కి ఎగబాకింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలోకు వంద రూపాయలు పెరిగి రూ.38,220కి చేరుకుంది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,390 కాగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.30,170 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.40,220గా నమోదైంది. ఇక, సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400గా ఉంది. కిలో వెండి ధర రూ.38,220 వద్ద కొనసాగుతోంది.