నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. కర్ణాటకలో అనిశ్చితే కారణం

- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాలతో ప్రారంభమైనాయి.  కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో  తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు బుధవారం ఉదయం నెగిటివ్‌గా మొదలయ్యాయి.   కన్నడ నాట ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి  కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి  వ్యవహరిస్తున్నారు. దీంతో ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారాయి. సెన్సెక్స్‌ 179 పాయింట్లుక్షీణించి 35,365 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 10,743 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు బలహీనంగానేఉన్నాయి.  హీరో  మోటోకార్ప్‌, సిప్లా, గెయిల్‌, ఐసీఐసీఐబ్యాంక్‌,  ఎస్‌బీఐ, హెచ్‌పీసీఎల్‌, అల్ట్రా టెక్‌ టాప్‌ , పీఎన్‌బీ లూజర్స్‌గా వున్నాయి.  టెక్‌ మహీంద్ర, హిందాల్కో, టాటా  మోటార్స్‌, లుపిన్‌, హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ విన‍్నర్స్‌గా ఉన్నాయి.

- Advertisement -