26 ఏళ్లకే కేన్సర్‌తో… కన్నుమూసిన బాలీవుడ్ యువ నటుడు!

10:36 pm, Sat, 23 May 20

న్యూఢిల్లీ: బాలీవుడ్ యువనటుడు మోహిత్ బఘేల్ కరోనాతో శనివారం ఉదయం కన్నుమూశాడు. అతడి వయసు 26 సంవత్సరాలు. 

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ‘రెడీ’లో నటించిన మోహిత్ తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో మరణించినట్టు రచయిత, దర్శకుడు రాజ్ శాండిల్య తెలిపారు.

‘‘అతడు చాలా త్వరగా కన్నుమూశాడు. కేన్సర్ బారినపడిన మోహిత్ గత ఆరు నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.

ఈ నెల 15న అతడితో మాట్లాడా. అప్పుడతడు బాగానే ఉన్నాడు. కేన్సర్ నుంచి కోలుకోవడం కూడా ప్రారంభమైంది.

మథురలో అతడు తన తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి ఉంటున్నాడు. మా ఇద్దరికీ స్నేహితుడైన ఓ వ్యక్తి ద్వారా మోహిత్ మరణవార్త తెలిసింది.

అతడు తన ఇంటిలోనే ప్రాణాలు విడిచాడని స్నేహితుడు తెలిపాడు’’ అని రాజ్ శాండిల్య తెలిపాడు.

మోహిత్ ‘కామెడీ సర్కస్’, ‘జబారియా జోడి’ సినిమాలకు రాజ్ రైటర్‌గా పనిచేశాడు.

2019లో తన దర్శకత్వంలో వచ్చిన ‘డ్రీమ్‌గర్ల్’ సినిమాలో మోహిత్‌ను తీసుకోవాలనుకున్నానని, కానీ డేట్ల కారణంగా ఆ సినిమాలో కలిసి పనిచేయలేక పోయామని శాండిల్య వివరించాడు.