పాకిస్థాన్ వెళ్లిపోయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది! అలియాభట్ తల్లి సంచలన వ్యాఖ్యలు!

9:48 am, Wed, 3 April 19
alia_batt

ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ తల్లి, సీనియర్ నటి అయిన సోనీ రజ్దాన్ (62) ‘నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్’ అనే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ వెళ్లిపోవాలని డిమాండ్…

అక్కడ సాంస్కృతిక సమన్వయం కొరవడిందని వ్యాఖ్యానించారు. ఇక తాను చేసే వ్యాఖ్యల కారణంగా ఎప్పుడూ ట్రోల్ అవుతుంటానని కూడా వ్యాఖ్యానించారు. కొందరు తనను ‘దేశ వ్యతిరేకి’నని అంటున్నారని, పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు.

కానీ, ఇప్పుడు ఆలోచిస్తుంటే తాను పాకిస్థాన్ వెళ్లిపోయి ఉంటేనే బాగుండేదని అనిపిస్తోందని అన్నారు. అక్కడైతే తాను ఆనందంగా ఉండేదానినని, అక్కడి వారి ఆహారపు అలవాట్లు కూడా బాగుంటాయని కితాబిచ్చారు.