టాలీవుడ్‌లో మరో సంచలనం! ఒకే సినిమాలో అమ్మగా రమ్యకృష్ణ , అత్తగా విజయశాంతి!

11:57 am, Fri, 3 May 19
Mahesh Babu Latest News, Tollywood Latest News, Telugu Movie News, Newsxpressonline

హైదరాబాద్: మహేశ్ బాబు 26వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనుండగా, నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని, మరో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

దాంతో విజయశాంతి ఏ పాత్రలో కనిపించనుంది? రమ్యకృష్ణ పాత్ర ఏమిటి? అనే ఆత్రుత అందరిలోను మొదలైంది. ఈ సినిమాలో మహేశ్ బాబుకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందనీ, అత్త పాత్రను విజయశాంతి పోషించనుందనేది తాజా సమాచారం.

ఈ రెండు పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయట. అందువల్లనే ఇంతటి క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్స్‌ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. జగపతిబాబు కూడా మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

చదవండి:  చిరంజీవి ఫాం హౌస్‌లో అగ్నిప్రమాదం! పూర్తిగా కాలిపోయిన ‘సైరా’ సెట్!