భయపెడుతున్న ‘గేమ్ ఓవర్’ ట్రైలర్…

5:15 pm, Thu, 30 May 19

హైదరాబాద్: అందాల భామ తాప్సీ ప్రధాన పాత్రలో….యువ దర్శకుడు అశ్విన్ శరవణ్ తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రం గేమ్ ఓవర్. హారర్ సస్పెన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఇక ఈ సినిమా హిందీతో పాటు తెలుగు .. తమిళ భాషల్లోను జూన్ 14న విడుదల కానుంది.

హారర్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై మరింత ఆసక్తిని పెంచేదిలా వుంది. ట్రైలర్‌లో ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు బాగానే ఉన్నాయి.

తెలుగు, తమిళ్ బాషల్లో అందాలని ఒలకబోసిన తాప్సీ బాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలను పోషిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె హిందీలో ‘గేమ్ ఓవర్’ అనే హారర్ థ్రిల్లర్ సినిమా చేసింది.  ఈ సినిమాతో తన ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ చేరనుందనే నమ్మకంతో తాప్సీ వుంది.

ట్రైలర్ చూడండి…

చదవండి: యాత్ర-2లో రాజారెడ్డి, జగన్‌ పాత్రలే మెయిన్…