ఆస్కార్ అకాడమీ జాబితాలో హృతిక్ రోషన్, అలియా భట్, నీతాలుల్లా

4:56 pm, Wed, 1 July 20

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 28 ఫిబ్రవరి 2021లో జరగాల్సిన ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల వేడుక ఆస్కార్‌‌ను ఏప్రిల్‌ 25న నిర్వహించబోతున్నట్లు అకాడమీ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ రూబిన్‌ పేర్కొన్నారు.

ఆస్కార్ అవార్డులను అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏఎంపీఏఎస్), ప్ర‌తి ఏడాది అనేక మంది ప్రపంచ సినీ ప్రముఖులను అకాడమీలోకి ఆహ్వానిస్తుంది.

అకాడమీ జాబితాలో చేర‌బోయే స‌భ్యుల వివ‌రాల‌ను ఏఎంపీఏఎస్ ప్రచురించింది. హృతిక్ రోష‌న్‌, అలియా భ‌ట్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్ నీతా లుల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ప్రియ స్వామినాథ‌న్‌, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూస‌ర్స్ విశాల్ ఆనంద్ (వార్‌, భార‌త్‌), సందీప్ క‌మ‌ల్‌( పానిప‌ట్,జ‌ల్‌) త‌దితరులు ఈ ఏడాది అకాడ‌మీ స‌భ్యులుగా ఉంటార‌ని పేర్కొంది. మొత్తం 819 మంది స‌భ్యుల‌ని జాబితాలో చేర్చ‌గా, వివిధ క్యాట‌గిరీలు ఆధారంగా ఎంపిక చేశారు.