ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో.. అవి కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావు: కంగనా రౌనత్

- Advertisement -

ముంబై: బాలీవుడ్ తెరపై ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న హీరోయిన్ కంగనా రౌనత్.. తాను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన కష్టాల గురించి ఇటీవల వివరించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో ఆమె ప్రవేశించినప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డానన్నారు. అవార్డ్ ఫంక్షన్ల కోసం మంచి దుస్తులు కొనుగోలు చేయడానికి డబ్బులు ఉండేవి కావన్నారు.

చదవండి: ఒక దశలో నేనూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా, కానీ..: ఖుష్బూ

‘‘ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో పారితోషికం చెల్లించరు. సినిమాల్లో అవకాశం ఇవ్వడమే గొప్ప అంటారు. ఈ రకమైన విధానం వల్ల నేను మొదట్లో నేను ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డాను..’’ అని కంగన తెలిపారు. 

‘గ్యాంగ్‌స్టర్’ చిత్రం చేసిన తరువాత అవార్డ్స్ ఫంక్షన్లకు వెళ్లడానికి సరిపోయే దుస్తులు తన వద్ద ఉండేవి కావని ఆమె పేర్కొంది. 

‘‘డిజైనర్ గౌన్లు కొనడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఆ సమయంలో రిక్కీ రాయ్ అనే స్నేహితుడు నాకు దుస్తుల విషయంలో సహాయం చేసేవాడు.

అతడి సహాయానికి నేను ఆశ్చర్యపోయేదాన్ని..’’ అని కంగన వ్యాఖ్యానించింది.

చదవండి: హీరోయిన్ కీర్తి సురేష్‌కు.. మరో హీరోయిన్ రష్మిక మందన్న ప్రశంసలు…

నిజం చెప్పాలంటే తనకు అవార్డుల ప్రదానోత్సవాలకు హాజరుకావడం ఇష్టం ఉండేది కాదని, అందుకే అలాంటి వేడుకలకు తాను దూరంగా ఉండేదాన్నని కంగన వెల్లడించింది. 

‘‘ఒకప్పుడు చిన్న మొత్తం డబ్బులకే ఎంతో ఇబ్బంది పడేదాన్ని.. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నా.. నా సినీ పరిశ్రమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటే నాకే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది..’’ అంటూ వివరించింది.

 

- Advertisement -