షాకింగ్: గ్లామరస్ స్టార్ హీరోయిన్.. ఇలా మారిపోయిందేమిటి?

2:37 pm, Mon, 25 March 19
Deepika Padukone, Deepika Padukone's new movie,, Newsxpressonline

ముంబై: సినిమా హీరోయిన్ అంటేనే.. గ్లామర్‌కి కేరాఫ్ అడ్రస్. నచ్చిన హీరోయిన్ అందచందాలు, ఒంపుసొంపులు ప్రదర్శిస్తే.. సినిమా హిట్ కాక చస్తుందా? అందరు హీరోయిన్ల సంగతి ఏమోగానీ.. దీపికా పదుకోన్ రూటే వేరు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే.. డీ గ్లామర్ పాత్ర చేయడానికి కూడా వెనుకాడదట.

తాజాగా దీపికా పదుకోన్ ‘చపాక్’ అనే సినిమా కోసం ఇలా మారిపోయింది. పద్మావత్ తర్వాత దీపికా నటిస్తున్న సినిమా ఇదే. పద్మావత్‌లో దీపికాని చూసి.. ఇలా చూడాలంటే ఒకింత కష్టమేకానీ.. క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు?

‘చపాక్’ చిత్రంలో దీపికా.. యాసిడ్ బాధితురాలి పాత్రలో కనిపించనుంది. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి దీపికా ఫస్ట్ లుక్ విడుదలైంది. అదే ఇప్పుడు మీరు చూస్తున్నది.

నిర్మాతగా కూడా దీపికానే…

‘రాజీ’ మూవీ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా నటించడంతోపాటు సినిమాకు నిర్మాతగా కూడా దీపికానే వ్యవహరిస్తోంది. ఫిల్మ్ క్రిటిక్ రమేష్ బాలా ఈ ఫస్ట్ లుక్‌ను తన ట్విటర్‌ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఆ తర్వాత దీపికా కూడా ఇదే ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వచ్చే ఏడాది జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు దీపికా వెల్లడించింది. గతంలో ఆర్ట్ సినిమాల్లో నటించిన హీరో, హీరోయిన్లను మేకప్ లేకుండా చూశాంగానీ.. ఇలా వికృతమైన మేకప్‌‌ కూడా వేసుకుని కెమెరా ముందుకు రావడానికి ఎంత గుండె ధైర్యం కావాలి. నాకున్నదే అది అంటోంది దీపికా పదుకోన్.