అమెజాన్ ప్రైమ్‌ మల్టీమిలియన్ డాలర్ల ప్రాజెక్టుపై సంతకం చేసిన ప్రియాంక చోప్రా

- Advertisement -

ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెజాన్ ప్రైమ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ ప్రాజెక్టు కోసం ఆమె సంతకం చేసింది. ఈ ఒప్పందం విలువ కోట్లాది రూపాయల్లో ఉందని సమాచారం. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ కార్యక్రమాన్ని రూపొందించనున్నారు.

 

- Advertisement -

ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో మరింత భారతీయతను ప్రదర్శిస్తానని తెలిపింది. ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు లేకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ప్రతిభకు ఒక ప్లాట్ ఫాంను సిద్ధం చేయాలనేది తన లక్ష్యమని పేర్కొన్న ప్రియాంక… సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబల్ పిక్చర్స్ ను స్థాపించినట్టు పేర్కొంది. అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇదే కారణమని వివరించింది.

- Advertisement -