రెచ్చిపోయిన సల్మాన్‌ఖాన్ మాజీ బాడీగార్డు.. స్టెరాయిడ్సే కారణం!

1:49 pm, Fri, 27 September 19

మొరాదాబాద్(ఉత్తరప్రదేశ్):  బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ బాడీ గార్డు చెలరేగిపోయాడు. వాహనాలను ధ్వంసం చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.

తాళ్లు, వలతో పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పదుల సంఖ్యలో ఉన్న స్థానికుల సహకారంతో ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకోవడం, మతిస్థిమితం కోల్పోవడం వల్లే అతడు అలా వ్యవహరించాడని వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖురేషీ గతంలో సల్మాన్‌కు బాడీగార్డుగా ఉండేవాడు.

ముంబైలో బౌన్సర్‌గా పనిచేసేవాడు. ఈ నెల 26న గురువారం ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్‌లో హల్‌చల్ చేశాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పట్టుకోవడానికి ప్రయత్నించినా ఖురేషీ ప్రతిఘటించాడు. చివరకు వలలు, తాళ్ల సహాయంతో అతడిని బంధించారు.