క్యాస్టింగ్ కౌచ్: అజ్ఞాతంలోకి బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్!?

tanusri-dutta-nana-patekar
- Advertisement -

tanusri-dutta-nana-patekar

ముంబై: క్యాస్టింగ్ కౌచ్‌కి సంబంధించి ఓ ఘటన ప్రస్తుతం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది.  సీనియర్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని హీరోయిన్ తనుశ్రీ దత్తా ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే.  2009లో వచ్చిన ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ ‌తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా ఆరోపించింది.

- Advertisement -

చదవండి: హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌పై పబ్లిక్‌గా చెయ్యేసిన డైరెక్టర్.. షాక్ తిన్న హీరోయిన్!

అయితే అదంతా అబద్ధమని, అప్పుడు షూటింగ్ స్పాట్‌లో దాదాపు 100 మంది ఉన్నారని నానా పటేకర్ పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఆరోపణల నేపథ్యంలో నానా పటేకర్ ఆమెకు లీగల్ నోటీసులు కూడా పంపారు. వెంటనే క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని  ఆ నోటీసులో హెచ్చరించారు.

అజ్ఞాతంలో నానా పటేకర్?

అయితే ఈ ఘటన తర్వాత  నానా పటేకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.  ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘హౌస్ ఫుల్-4’ చిత్రంలో అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, బాబీ డియోల్‌తో కలిసి నానా పటేకర్ నటిస్తున్నారు. అయితే సినిమా యూనిట్ షూటింగ్ కోసం రాజస్తాన్‌లోని జైసల్మేర్‌కు వెళ్లగా, నానా పటేకర్ మాత్రం షూటింగ్ స్పాట్‌కు రాలేదు.

అంతేకాదు, సినిమా యూనిట్‌కు కూడా ఆయన ఆచూకీ చెప్పలేదని సమాచారం. దీంతో ఆయనపై చిత్రీకరించాల్సిన సీన్లను దర్శకుడు సాజిద్ ఖాన్ వాయిదా వేసుకున్నారు.  మరోవైపు ఈ వ్యవహారంలో హీరోయిన్ తనుశ్రీ దత్తాకు.. ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, ఫర్హాన్ అక్తర్, ట్వింకిల్ ఖన్నా, సోనమ్ కపూర్ వంటి సెలబ్రిటీలు మద్దతు ప్రకటించారు.

- Advertisement -