కబీర్ సింగ్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ

4:41 pm, Sat, 15 June 19
Megastar Latest News, Vijay Devarakonda Latest News, Tollywood Movie News, Newsxpressonline

హైదరాబాద్: యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన `అర్జున్ రెడ్డి` సినిమా ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ సినియతో యువ‌త‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమాన న‌టుడిగా మారిపోయాడు.

అయితే ఈ సినిమా ప్ర‌స్తుతం హిందీలోకి `క‌బీర్ సింగ్‌`గా రీమేక్ అవుతోంది. తెలుగు సినిమాను రూపొందించిన సందీప్ వంగా ఈ రీమేక్‌కు కూడా డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ఇక షాహిద్ క‌పూర్‌, కియారా ఆడ్వాణీ హీరోహీరోయిన్లుగా న‌టించారు. తాజాగా ఈ సినిమా గురించి విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడాడు. క‌బీర్ సింగ్‌` క‌చ్చితంగా బ్లాక్‌బ‌స్టర్‌గా నిలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

`హిందీ రీమేక్‌ను కూడా తన స్నేహితుడు సందీపే రూపొందిస్తున్నారని, ఆ సినిమా కూడా క‌చ్చితంగా బ్లాక్‌బస్ట‌ర్ హిట్‌గా నిలుస్తుందని అన్నాడు. షాహిద్ మంచి న‌టుడని, ఇప్పుడు `క‌బీర్ సింగ్‌`లోనూ ఆయ‌న అద్భుత న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి ఉంటారని, `క‌బీర్ సింగ్‌` కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా అని విజ‌య్ అన్నాడు.

చదవండి: పూజా కార్యక్రమాలని పూర్తి చేసుకున్న రానా ‘విరాటపర్వం’