200 కోట్ల క్లబ్‌లోకి ‘భరత్ అనే నేను’.. హిందీ రీమేక్ రైట్స్ కోసం పోటీ!

10:13 am, Thu, 10 May 18

‘భరత్ అనే నేను’ సినిమాకి ముందు మహేశ్ బాబు చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆయన అభిమానులు కోరుకున్నారు. ఈ సినిమా సాధిస్తోన్న వసూళ్లు చూస్తుంటే వాళ్ల కల నెరవేరిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, మే 5వ తేదీ నాటికి 190 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయిందనేది తాజా సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు తమిళనాట కూడా ‘భరత్ అనే నేను’ మొదటి నుంచి మంచి ఊపును కొనసాగిస్తోంది. ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడంతో.. రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాతలు  పోటీపడుతున్నారని సమాచారం.