50 డేస్ రేసులో అమ్మాడి.. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఎంతో తెలుసా?

mahanati-movie
- Advertisement -

Mhanati 50 days“మహానటి” థియేటర్లలో జనం సినిమా చూస్తున్నంతసేపూ ఉత్కంఠతో కూడిన నిశ్శబ్ధం ఆవహించిన విషయం మనందరికీ తెలిసిందే, ఈ మధ్య వచ్చిన బయోపిక్‌లలో గొప్ప సినిమా అని అందరూ మనస్పూర్తిగా ఒప్పకున్న ఏకైక చిత్రం ఇదే కావచ్చు. పోటీకి వచ్చిన సినిమాలతో ధీటుగా నిలబడి, కొన్నిటిని వెనక్కి నెట్టి రేసులో నిలుచుంది మహానటి.

ఎవరూ ఊహించని రీతిలో మహానటి మూవీ వసూళ్లు సాధించి, సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భలే లాభాలు తెచ్చిపెట్టింది. ఇటీవలే 50 రోజులను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రేసులో ఇంకా ముందుకు సాగిపోతూనే ఉంది. ఇండియాలోనే కాకుండా విడుదలైన ప్రతిచోటా మంచి లాభాలను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం రూ. 10.55 కోట్లు రాబట్టి, ఇండియాలో 3.45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే 43 కోట్ల వరకూ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను రాబట్టింది. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం, ప్రపంచ వ్యాప్తంగా రూ. 78 కోట్ల షేర్ వసూలు చేయగా అందులో రూ. 43 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది.

- Advertisement -

 

- Advertisement -