‘మహానటి’ మరో రికార్డు! అమెరికాలో ఫుల్ పైసా వసూల్!!

- Advertisement -

వాషింగ్టన్: మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘మహానటి’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌, సావిత్రి పాత్ర పోషించిన కీర్తిసురేష్‌తోపాటు ఇతర తారాగణానికి, నిర్మాతలపై అన్నిచోట్లా ప్రశంసల జల్లు కురుస్తోంది. విమర్శకులు సైతం ‘మహానటి’ చిత్రాన్నిమెచ్చుకుంటున్నారు.

మరోవైపు కలెక్షన్ల పరంగా ‘మహానటి’ దూసుకెళ్తోంది. అమెరికాలో దాదాపు 150కిపైగా లోకేషన్లలో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోల రూపంలో మంచి కలెక్షన్లను రాబట్టడమే కాకుండా లాంగ్‌రన్‌లో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది.

- Advertisement -

అంతేకాదు, అమెరికాలో 120కి పైగా లోకేషన్లలో మంచి కలెక్షన్లతో విజయవంతంగా దూసుకెళ్తోంది ఈ చిత్రం. ‘మహానటి’ని అమెరికలో పంపిణీ చేసిన ‘నిర్వాణ సినిమాస్’ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించి  ఓ పోస్ట‌ర్‌ను ఈ సంస్థ ఇటీవల విడుదల చేసింది.  దర్శకుడు నాగ్ అశ్విన్, నటి కీర్తి సురేష్‌, ఇతర నటీనటులు, నిర్మాతలు గొప్పతనమే చిత్ర విజయానికి కారణమని, ధన్యవాదాలు తెలుపుతున్నామని.. ‘నిర్వాణ సినిమాస్’ పేర్కొంది.

- Advertisement -