‘ఆట‌గ‌ద‌రా శివ’ మూవీ రివ్యూ

- Advertisement -

aatagadara-siva-movie-review

ఓ నేరస్థుడిని  ఉరి తీయటానికి తలారి.. జైలుకు బయిలుదేరతాడు. అదే సమయంలో ఆ ఉరి శిక్ష పడ్డ నేరస్థుడు.. జైలు నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తాడు.  ఆ ప్రయత్నంలో వచ్చీ వచ్చీ.. ఈ తలారినే లిఫ్ట్ అడిగి అతడి వెహికల్ ఎక్కుతాడు. ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలియదు.  అలా జర్నీ మొదలవుతుంది.  ఆ తలారికి తను ఉరి తీయబోయే ఖైదీ తన పక్కనే ఉన్నాడని, అదీ పారిపోతున్నాడని తెలిస్తే?  అలాగే తనని ఉరి తీసేవాడే తనకి లిప్ట్ ఇచ్చాడని ఆ ఖైదీకి తెలిస్తే??

- Advertisement -

వినటానికి ఈ స్టోరీ లైన్ ఇంట్రస్టింగ్‌గా ఉంది కదా… అదే దర్శకుడు చంద్ర సిద్దార్దని కూడా ఎట్రాక్ట్ చేసినట్లుంది.  కన్నడలో  సూపర్ హిట్టైన ‘రామ రామరే’ సినిమాను… శివుడి ఆటగా మార్చి మన ముందుకు తీసుకొచ్చారు. గతంలో ‘ఆ నలుగురు’, ‘అందరి బంధువయా’ వంటి మానవతా విలువలు ఉన్న సినిమాలు అందించిన చంద్ర సిద్దార్ద.. ఈ రీమేక్‌లో తనదైన శైలిని మిళితం చేశారా?  కన్నడ తరహాలోనే తెలుగు నాట కూడా ఘన విజయం సాధించే అవకాశం ఉన్న సినిమాగా మార్చగలిగారా? ఈ విషయాలన్నీ తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

aatagadara-siva1కథేంటి?

ఉరిశిక్ష పడ్డ ఖైదీ బాబ్జీ( ఉద‌య శంక‌ర్‌)  జైల్లో సెంట్రీని కొట్టి పారిపోతాడు. తప్పించుకునే ప్రాసెస్ లో  ఓ లారీలో ఎక్కితే వాడి టైమ్ బాగోకో..బాగుండో.. టైర్ పంక్చ‌ర్ అవుతుంది. దాంతో ఆ దారిలో వెళ్తున్న జంగ‌య్య (దొడ్డ‌న్న‌) వెహికల్ ఎక్కుతాడు. ఇంతకీ  జంగయ్య మరెవరో కాదు..బాబ్జీ పాలిట యముడు. అతన్ని ఉరితీసే తలారి. ఆయన ఆ పని మీద జైలుకు బయిలుదేరాడు. జంగయ్యకు తనను లిప్ట్ అడిగింది తను ఉరితీయబోయే ఖైదినే అనే విషయం తెలియదు. అలాగే బాబ్జీకు ఆయనే తన తలారి అని తెలియదు. ఇద్దరూ కలిసి ప్రయాణిస్తూంటారు. ఈ జర్నిలో వీళ్లకు ఓ ప్రేమ జంట(హైపర్ ఆది) లిప్ట్ అడుగుతుంది. అలాగే మరికొంత దూరం వెళ్లే సరికి…ఓ ముసలామె,డెలవరికి సిద్గంగా ఉన్న గర్బవతి లిప్ట్ అడుగుతారు.

ఈ లోగా బాబ్జీని లేపేయటానికి పాతిక లక్షలు సుపారి తీసుకుని  ఓ పోలీస్ అధికారి (కోటి) బయిలుదేరతారు. ఇవన్ని ఇలా ఉంటే..   పేపర్‌లో పడ్డ ప్రకటన ద్వారా తమతో ప్రయాణం చేస్తోంది.  ఉరిశిక్ష పడ్డ ఖైదీ అని జంగయ్యకు, ఆదికు మరికొంత మందికి తెలుస్తుంది. అప్పుడు ఏమౌతుంది.. జంగ‌య్య అత‌న్ని ఉరితీశాడా?  సుపారి తీసుకున్న పోలీస్ ఏం చేసాడు..అసలు ఆల్రెడీ ఉరిశిక్ష పడ్డ ఖైదిని చంపాలని ఎవరు సుపారి ఇచ్చారు..ఆ ఖైధీ ప్లాష్ బ్యాక్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

rama-rama-reతెలుగు నేటివిటి  మర్చిపోయారే…

ఇతర భాష హిట్ సినిమాలను తెలుగు రీమేక్ చేసేది మన నేటివిటి కోసం…అంతే కాని కన్నడ సినిమాని కన్నడ ఆర్టిస్ట్ లతోనే రీమేక్ చేసే బదులు డబ్బింగ్ చేయటం బెస్ట్ కదా!

కన్నడంలో ఘన విజయం సాధించిన ఈ  రోడ్ మూవీ…తెలుగు రీమేక్ వెర్షన్ కు వచ్చేసరికి నేటివిటి మిస్సైనట్లు అనిపిస్తుంది. దానికి కారణం తలారి పాత్ర, ఖైదీ పాత్ర వేసిన ఆర్టిస్ట్ లు మనకు తెలియని వాళ్లు అవటం, మనవాళ్లలా అనిపించకపోవటం.  హైపర్ ఆది, చమ్మక్ ఛంద్ర, చలాకి చంటి వంటి జబర్దస్త్ కమిడియన్స్ ని పెట్టుకున్నా…వాళ్లంతా మెయిన్ పాత్రలు కాకపోవటంతో  డబ్బింగ్ సినిమాకు మన తెలుగు కామెడి ట్రాక్ జత చేసినట్లు ఉంది. అలాగని వారి ఆశించిన స్దాయిలో ఫన్ జనరేట్ కాలేదు. అప్పటికీ హైపర్ ఆది తన వరస పంచ్ లతో జబర్దస్త్ ఎపిసోడ్ లా తయారు చేసే ప్రయత్నం చేసాడు.

దానికి తోడు ఆది మీద ఓ ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ కూడా పెట్టారు. కంటెంట్ పరంగా ఓ సీరియస్ లవ్ స్టోరీ అయిన అది కాస్తా…ఓ  కామెడీ స్కిట్ లా తయారై, బలవతంగా కథలో కామెడీ తగ్గింది ఆ లోటు తీర్చడం కోసం  ఇమిడ్చిన వ్యవహారంలా మారింది. సీరియస్ గా నడుస్తున్న సినిమాలో ఆ సీన్స్  ఇబ్బందిగా మారాయి.

aatagadara-siva2తెలుగు సినిమాకు తెలుగు  డబ్బింగ్ చెప్పించినట్లు…

ముఖ్యంగా సినిమాలో ఏ పాత్రను ఫాలో కావాలో అర్దం కాని సిట్యువేషన్. కీ రోల్స్  అయిన ఖైదీనా, తలారినా.. ఇద్దరిలో ఎవరో ఒకరైనా కాస్తంత తెలుసున్న ఆర్టిస్ట్ ని పెట్టి ఉంటే ఖచ్చితంగా వాళ్ల కథగా మనం ఫాలో అవుదుము. అప్పుడు వారి ఎమోషన్స్ మన ఎమోషన్స్ గా ఫీల్ అవుదుము. అలా జరగలేదు.తెరపై మనకు సంభందం లేని కథ ఏదో జరిగినట్లు అనిపించింది. అదే ఏ డబ్బింగ్ సినిమానో అయితే…మనకు ఆ విషయం తెలుసు కాబట్టి సమస్య రాదు. తెలుగు సినిమా అని చెప్పి..డబ్బింగ్ చూపించినట్లు అయ్యింది.

అలాగే ఉరిశిక్ష పడ్డ ఖైదీని చంపటానికి సుపారి ఇచ్చిన కారణం సరిగ్గా రిజిస్టర్ కాలేదు. ఆ సుపారి తీసుకున్న పోలీస్ అధికారి పాత్రకి సరిగ్గా జస్టిఫికేషన్ ఇవ్వలేదు. సినిమాలో ఏకైక నెగిటివ్ పాత్ర అదే. ఆ పాత్రని సరిగ్గా నిలబెట్టి ఉంటే .. కథలో కాన్‌ఫ్లిక్ట్స్ పుట్టి ఇంటెన్సిటి ఉండేది. అలాంటివి వద్దనుకుంటే అసలా పాత్రనే పెట్టకుండా ఉండాల్సింది. ఆ నెగిటివ్ పాత్రను పెట్టి.. మళ్లీ ఆ పాత్రను అర్ధాంతరంగా ముగించేయటంతో చాలా అసంతృప్తిగా అనిపించింది.

హైలెట్…

తలారిగా.. కన్నడ నటుడు దొడ్డన్నతన పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల మోహన్ లాల్ గుర్తుకొచ్చారు కానీ, పాత్రలో జీవించారు అనే పదానికి అర్థమొచ్చేలా చేశారు.  డైలాగులు చాలా చోట్ల బాగున్నాయి.

అలాగే సినిమాలో నెగిటివ్ పాత్రలో పోలీస్ అధికారిగా చేసిన కోటి.. చాలా బాగా చేశారు. సినిమాకు ప్లస్ పాయింట్స్‌లో ఆయనొకరు.. అయితే ఆ పాత్ర నిడివిని మరింత పెంచి ఉంటే బాగుండేది. అంతేకాదు, తెలుగు సినిమాకు మరో మంచి విలన్ దొరికినట్లు కూడా అనిపించింది.

aatagadara-siva3మంచి ఎలిమెంట్స్ మిస్ చేశారు…

ఒరిజనల్ కన్నడ వెర్షన్ రచించి, డైరక్ట్ చేసిన సత్య ప్రకాష్ చాలా అబ్సర్డ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని నింపి కొత్త లుక్ తెచ్చారు. ముఖ్యంగా ఓ టీవి సీరియల్‌కు అడిక్ట్ అయిన  పోలీస్ అధికారి.. క్రిమినల్‌ని పట్టుకునే పనిలో తనకిష్టమైన సీరియల్ క్లైమాక్స్ మిస్ అవుతానని ఆలోచనలో పడటం, ప్రేమించుకుని పారిపోయిన ప్రేమ జంటను పట్టుకుందామని వెంటబడే గ్రామీణ బ్యాచ్.. ఓ సెల్ఫీ కోసం.. ఆ పనిని పక్కన పెట్టడం వంటివి ఎన్నో.. మన నిత్య జీవితంలో వేసే సెటైర్స్‌ని ఈ సినిమాలో తీసేశారు. ముఖ్యంగా కన్నడ సినిమాలో ఎక్కువ భాగం వ్యంగ్య ధోరణిలో నడిపారు. అదే అక్కడ సక్సెస్‌కు కారణమైంది. కానీ తెలుగులోకి వచ్చే సరికి ఆ ఎలిమెంట్స్‌ని వదిలేశారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే …

కన్నడ సినిమాని సంగీతం నుంచి, షాట్స్ వరకూ యాజిటీజ్‌గా ఫాలో అయిన ఈ సినిమాలో ఏ విభాగం గురించి మెచ్చుకున్నా లేదా.. తిట్టుకున్నా అది ఆ కన్నడ సినిమాకే చెందుతుంది.

ఫైనల్ ధాట్…

అంతా ఈశ్వరేచ్ఛ…

జనం చూస్తారా?

సినిమా అంటే కొన్ని పంచ్ డైలాగులు, ఫైటింగ్ సీన్స్, కామెడీ సీక్వెన్స్‌లు, ఐటం సాంగ్ లేనా? అని మనసా, వాచా సోషల్ మీడియా సాక్షిగా విసుక్కునే  ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్. అయితే అలాంటివారు ఎంత మంది ఉన్నారు అన్న దానిపై ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుంది.

ఎవరెవరు?

నటీనటులు: ఉదయ్‌ శంకర్‌, దొడ్డన్న, ‘హైపర్‌’ ఆది, ‘చలాకీ’ చంటి, చమ్మక్‌ చంద్ర తదితరులు
సంగీతం: వాసుకీ వైభవ్‌
నేపథ్య సంగీతం: నోబిన్‌ పాల్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
సినిమాటోగ్రఫీ: లవిత్‌
నిర్మాత: రాక్‌లైన్‌ వెంకటేష్‌
దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ
బ్యానర్‌: రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
విడుదల తేదీ: 20-07-2018

- Advertisement -