సెకండాఫ్ కు ఏమైంది?: ‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ రివ్యూ

ee-nagaraaniki-emaindi
- Advertisement -

ee-nagaraaniki-emaindi‘సైన్మా’ షార్ట్ ఫిలిం చూసి ఈ డైరెక్టర్ ఎవరో కానీ సినిమా తీస్తే అదరగొడతాడు అనుకున్నా.  ‘పెళ్లి చూపులు’తో.. నువ్వు అనుకున్నది నిజమే భయ్యా అని రుజువు చేసేశాడు.  ‘పెళ్లి చూపులు’లోనే అదరగొట్టాడు.. ఇక నెక్ట్స్ మూమూలుగా ఉండదు.. కేక పెట్టిస్తాడు… అని ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకుని పరుగెత్తుకెళ్లి చూస్తే… ఫస్టాఫ్ సూపర్ అనిపిస్తే.. సెకండాఫ్.. పాపర్ అనిపించాడు. టోటల్‌గా నాకైతే ఓకే అనిపించాడు. మరి సిటీ కుర్రాళ్లు మాత్రం చుక్కేసి సిందేసినంత హ్యాపీ అంటున్నారు.  ‘ఆ…అయినా సింగిల్ స్క్రీన్స్‌లో ఎన్ని రోజులు ఆడితే మాత్రం ఏమొస్తుంది.. మల్టి ఫ్లెక్స్ లో అయితే మూడు రోజుల్లో వచ్చే డబ్బులు వస్తాయి అంటారు.. అందుకే కావాలని ఇలా తీశారు..’’ అని కొందరు ట్రేడ్ విశ్లేషణలు చేసేస్తున్నారు. మరి ఇంతకీ ఏ నగరంలో.. ఏం జరిగింది? ఎందుకిలా డివైడ్ టాక్ వచ్చింది?? ఇప్పుడు చూద్దాం…

ఆ నలుగురు.. తాగేసి ఏమైపోయారంటే…

నగరంలో  నలుగురు ఫ్రెండ్స్  వివేక్‌(విశ్వక్సేన్‌ నాయుడు), కార్తీక్‌(సుశాంత్‌రెడ్డి), కౌశిక్‌(అభినవ్‌గో మతం), ఉపేంద్ర(వెంకటేశ్‌ కాకుమాను) . వాళ్లలో కార్తీక్ కు పెళ్లి కుదరటంతో ఓ పబ్ లో ఫ్రెండ్స్‌కు  పార్టీ ఇస్తాడు. అయితే ఆ పార్టీలో తెగ తాగి, ఒళ్లు పై తెలియక, ఎటు వెళ్తున్నామో చూసుకోక.. గోవాలో తేలతారు. అక్కడకు వెళ్లి ఆ హ్యాంగోవర్ దిగాక వాళ్లు ఏం చేశారు? తమ జీవితంలో వదిలేసిన లక్ష్యాల వైపుగా ఎలా ప్రయాణించారు? ఆ జర్నీలో వాళ్లకు జీవితం గురించి ఏం తెలిసొచ్చింది? అసలు ఇలాంటి కథకు, ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్‌కు సంబంధం ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ తెరపై చూడాల్సిందే!

- Advertisement -

ఎలా ఉందీ అంటే…

బిగ్ బాస్ లాంటి రియాల్టి షో ని నలుగురు కుర్రాళ్ల జీవితాలతో వాళ్లకు తెలియకుండా కెమెరా పెట్టి, రోడ్డుపైకి వదిలి  నడిపితే ఎలా ఉంటుందో అలా ఉంది.  ఎవరో ముక్కు మొహం తెలియని కుర్రాళ్లతో  చాలా సహజంగా అనిపిస్తూ..కొంత డ్రామా యాడ్ అవుతూ…ఫ్రెష్ గా కనిపిస్తూ..కాస్త సాగుతూ..కొంత విసిగిస్తూ..మరికాసేపు బాగుందనిపిస్తూ …చివరకి వచ్చేసరికి  అదేదో గా బాగానే ఉందిగా అనిపించేలా ఉంది.  దర్శకుడు ఇది కొత్త ప్రయోగం అనుకుని చేస్తే శభాష్. కాదు మామూలుగా సినిమానే చేసాను  అనుకుని చేస్తే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే.

అది అంతా డైరక్టర్ పాయింటాఫ్ వ్యూ. ఎక్కడైనా ఈ నలుగురులో ఎవరినైనా ఫాలో అవుదామని ప్రయత్నించినా ఆ ప్రయత్నం మొహమాటం లేకుండా బెడిసికొడుతుంది.

మెచ్చుకోవాల్సిందే…

అయితే రెగ్యులర్ గా ఓ హీరో, హీరోయిన్ , లవ్ ఎపిసోడ్స్ , పాటలు ,ఫైట్స్ వంటి ఎలిమెంట్స్ లేకుండా జీవితంలాగే కంట్రోలు లేని సంఘటనలతో కథ రాసుకుని సినిమా తీయటం మాత్రం దర్శకుడు గొప్పతనమే.  అంతేకాదు  హాలీవుడ్ లో రొటీన్ గా వచ్చే ఇలాంటి కథని మనవాళ్లకు పరిచయం చేయాలనే ఆలోచన ఉంది చూసారూ అదే మనం జై కొట్టాల్సిన అంశం. అలాగే ఈ సినిమాలో పరిచయం అయిన కుర్రాళ్లు సైతం చాలా బాగా చేసారు.

గుర్తుకు వస్తాయి…

మరి ఈ సినిమా చూస్తూంటే హ్యాంగోవర్, జింద‌గీ నా మిలేగీ దుబారా, దిల్ చాహ‌తాహై,రాక్ ఆన్ వంటి సినిమాలు కాస్తంత గుర్తుకు వచ్చి..మన మెమెరీ పవర్ పై మంచి నమ్మకాన్ని పెంచుతాయి..

ఇవి వదిలేశారు…

సహజత్వం కోసమే.. సరదా కోసమే.. ఈ కథలో ప్రధాన పాత్రలు నలుగురికి స్ట్రాంగ్ క్యారక్టరైజేషన్స్ రాసుకోలేదు.  దాంతో పెళ్లి చూపులు లాంటి మ్యాజిక్ ఇందులో కొరవడింది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆ తేడా మనకు కనిపిస్తుంది. ఎక్కడా ఎక్కడా ఎమోషనల్ గా మనకు కనెక్ట్ కానివ్వడు దర్శకుడు. తెరపై సంఘటనలు జరుగుతున్నా.. మనకేమీ అనిపించదు.  అలాగే పెళ్లి చూపులుకు ప్లస్ అయిన సంగీతం ,పాటలు ఇక్కడ మిస్ అయ్యాయి.

‘ఈ సినిమాకి ఏమైంది?’

జోకులు,  తాగుడు సన్నివేశాలతో నింపేశారెందుకు? అని అడగాలనిపిస్తోంది.. ఓహో.. మీ టార్గెట్ కుర్రాళ్లా… అయితే వాకే.

ఫైనల్ థాట్…

`జీవితమంటే.. నచ్చిన వాళ్లతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన పని చేసుకోవడమే..` ఈ సినిమాలోని ఈ డైలాగుకు ఎక్సటెన్షన్ గా ..

నచ్చిన సినిమాలు చూస్తూ…  అని కలపాలి.  మరి ఆ నచ్చిన సినిమాల్లో ఇది కలుస్తుందో లేదో.. చూడాలి!

థియేటర్‌కి వెళ్లేటప్పుడు…

ఫస్టాఫ్ చూసేటప్పుడు…

సెకెండాఫ్ చూసేటప్పుడు…

తారాగణం : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి
సంగీతం : వివేక్‌ సాగర్‌
దర్శకత్వం : తరుణ్‌ భాస్కర్‌
నిర్మాత : డి.సురేష్‌ బాబు

– సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -