‘నేనూ-శైలజ పార్ట్ 2’ అంటే సరిపోతుందేమో.. (‘హలో గురూ ప్రేమ కోసమే జీవితం..’ మూవీ రివ్యూ)

halo-guru-prema-kosame
- Advertisement -

halo-guru-prema

ఒకప్పుడు వరుస ప్లాఫ్‌లతో అల్లాడిపోయిన యువ హీరో రామ్ కి.. ‘నేనూ శైలజ’ సినిమా పెద్ద బ్రేక్ అయ్యింది. ఆ సినిమాలో తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని ఎంతో గొప్పగా అభివర్ణించాడు.. డైరక్టర్..కిశోర్ తిరుమల.. మళ్లీ అదే డైరెక్టర్ తో రామ్ చేసిన సినిమా..‘ ఉన్నది ఒకటే జిందగీ’..అంత పెద్ద హిట్ కాకపోయినా.. నిరాశపరచలేదు.

- Advertisement -

ఈ మధ్యలో రామ్ ఒకటి రెండు ‘మాస్’ దెబ్బలు తిని.. ఇప్పుడు మళ్లీ ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్, డ్రామా, యాక్షన్.. ఇలా ధనియాలు, యాలికులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూసుకొని.. ఒక లవ్ మసాలా కథతో ప్రేక్షకులకు వడ్డించడానికి ‘హలో గురూ ప్రేమ కోసమే జీవితం’ సినిమాతో ముందుకువచ్చాడు.

 నేనూ- శైలజా పార్ట్ – 2 అంటే బాగుంటేందేమో..

సినిమా అంతా చూశాక.. ఇందులో ‘నేనూ- శైలజా’ ఛాయలు పుష్కలంగా కనిపించాయి. అందులోనూ తండ్రీకూతుళ్ల అనుబంధం చూపిస్తే..ఇందులో కొద్దిగా ఛేంజ్ చేసినట్టు అనిపించినా.. అవే ఎమోషనల్ డైలాగులు.. ఒక కూతురు..తండ్రిని ఎంత గొప్పగా అభివర్ణిస్తుందో ఈ సినిమాలో అంతే గొప్పగా వర్ణించారు. ఒక రాత్రి  పార్క్ లో కూర్చున్న వేళ.. తండ్రి గురించి హీరోయిన్..హీరోకి వివరిస్తుంది. అలాగే హోటల్..లో.. పలు సందర్భాల్లో.. ఈ సన్నివేశాలు.. అక్కడ చూసినట్టే అనిపిస్తుంటాయి..

కథలోకి వస్తే…

ఇంటిలోనే ఉండి.. ఆ ఇంటమ్మాయిని ఎలా ప్రేమించాడు.. ఎలా ఆ ఇంట్లో వాళ్ల మనసులను గెలుచుకున్నాడు? ‘నో’ చెప్పే హీరో తండ్రి చేతే.. తన కూతురిని లేపుకొని వెళ్లిపొమ్మని చెప్పే సన్నివేశాల్లాంటివి.. కొంచెం ఇబ్బందికరంగా అనిపించాయి.

హీరో ఔచిత్యం బయటపెట్టడానికి అంతకన్నా గొప్ప సన్నివేశం.. సరికొత్తగా చెప్పడానికి అవకాశం వారికి తట్టకో.. లేదంటే అది చాలా బాగుందని..అక్కడ యూనిట్లో అందరూ ఠపాఠపా చప్పట్లు కొట్టేసరికి..సినిమా అంతా చక్కగా తీసి.. ఈ చివరి సన్నివేశం ఇలా తీసేశారేమో అనిపించింది.

జనరల్ గా ఏ తండ్రి.. కన్నకూతురిని.. ప్రేమించినవాడితో..అదీ తనతో కలిపి మందుకొట్టే వాడితో లేచిపో..అని చెప్పడు. అంటే ఇలాంటి ఒక గొప్ప సన్నివేశం తీసి.. తెలుగు సినిమా దౌర్భాగ్యాన్ని.. మరో మెట్టు పైకెక్కించారని చెప్పక తప్పదు.

కోర్టు తీర్పులే అడ్డదిడ్డంగా వస్తుండగా లేనిది.. ఒక తండ్రి .. తన కూతురిని నువ్వే ఎత్తుకుపో..అని హీరోతో చెప్పడం తప్పులేదేమో అని కూడా అనిపించింది.  అయితే హీరో రిజెక్టు చేస్తాడు..అది వేరే విషయం.. బట్.. నేనూ శైలజాలో కంటతడి పెట్టించే సన్నివేశాల్లో.. ఒక ఉదాహరణ చూస్తే.. ఊరి బయట.. సత్యరాజ్, రామ్ కూర్చుని.. ఉండగా.. సత్యరాజ్ ఒక్క మాటంటాడు.

‘‘పెళ్లయ్యాక కూతురిని.. ఇంకొకరింటికి పంపాలని ఎవడు రాశాడో తెలీదుకానీ.. కచ్చితంగా వాడికి కూతురు పుట్టి ఉండదు..’’

ఆడపిల్లల తల్లిదండ్రులందరూ ఒక్కసారిగా  కంట తడి పెట్టుకునే అలాంటి అద్భుతమైన డైలాగులు రాసిన సినిమాలో నటించిన రామ్.. ఇలాంటి సన్నివేశాల్లో అంటే నువ్వు ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకో అంటే  ప్రేక్షకులు ఒప్పుకోరు అనిపించింది. ఎందుకంటే దీనికి గతంలో ఒక ఉదాహరణ ఉంది.

సూపర్ స్టార్ కృష్ణ తీసిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా చూసిన విజయా అధినేత చక్రపాణి.. ‘‘సినిమా చాలా గొప్పగా ఉంది. కానీ ఈ సినిమా తర్వాత.. సీతారామరాజు పాత్రని మరిచిపోవడం ప్రేక్షకులకు అంత సులువు కాదు.. తర్వాత వచ్చేవి జాగ్రత్తగా ప్లాన్ చేసుకో..’’ అని చెప్పారంట.  ఆయన అన్నట్టుగానే ఆ తర్వాత వచ్చిన సుమారు 11 సినిమాలు వరుసగా దీపావళి టపాసుల్లా పేలిపోయాయంట. అలా ఒక మంచి సినిమా ఛాయలో తీసిన సినిమాలో సన్నివేశాలు అంతే బలంగా ఉండాలి..

అక్కడక్కడ పాత దంపుడు పచ్చడి కూడా ఎక్కువే..

బయట గొడవలు పడుతుంటే.. కన్నతల్లి..కొడుకుని లేపి.. ఏదో పరీక్షకు పంపినట్టు.. అవి సెటిల్మెంట్ చేసి రా.. అని చెప్పడం..                           సినిమా ఓపెనింగ్ షాటే.. సిక్సర్ అన్నట్లు మొదలైంది. అంటే హీరో వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేయడానికి.. రొటీన్ సన్నివేశాలతో ప్రారంభించారు. ఇంజనీరింగ్ అల్లాటప్పాగా చదివిని హీరోకి సాప్ట్ వేర్ కంపెనీలో రికమెండ్ చేస్తే ఉద్యోగం ఇచ్చేయడం..

ఒక స్నేహితుడి తండ్రితో కలిసి హీరో మందు కొట్టడం.. అంటే ఇందులో కొంచెం ఫర్వాలేదు.. కొన్నిచోట్ల తండ్రీకొడుకులే కలిసి తాగేయడం చూపించేస్తున్నారు. ఇలాంటి పైత్యాలు ఎక్కువగానే ఉన్నాయి. అంటే పాత దంపుడు పచ్చడి ఎక్కువగానే ఉంది.

త్రివిక్రమ్ లాంటివారే కామెడీ, పంచ్ డైలాగులు వదిలేసి.. తన శైలిలో ఛేంజ్ కోసం అరవింద సమేత లాంటి ఫ్యాక్షన్ సినిమాలు తీస్తుంటే.. ఇంకా ఇలాంటి పాత దంపుడు సన్నివేశాలతో నింపేస్తుంటే.. హీరో, ప్రొడ్యూసర్ అడగరా? అనేది ఒక ప్రశ్న.. అయితే యూత్ సినిమాలు చూస్తున్నారు..వారి కోసమే ఈ హిట్ ఫార్ములా సన్నివేశాలు..అంటారు.

కానీ ఎన్ని సినిమాలని వారు మాత్రం చూస్తారు. మళ్లీ ఎక్కడో గట్టి దెబ్బ పడితేనేగానీ ఈ బూజుపట్టిన ఫార్ములాని వదిలేలా లేరు..   అయితే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా, సాగదీత ఉన్నట్టుగా కూడా అనిపించాయి.

పట్టు తప్పిన డైరక్టరు…

‘సినిమా చూపిస్త మామా’, ‘నేను లోకల్’… లాంటి సూపర్ హిట్లను తీసిన డైరక్టర్ ‘ త్రినాథరావు బిక్కిన’ చేతిలో సినిమా కొంచెం  అన్ హోల్డ్ అయ్యిందేమో అనిపించింది. కథలో ఎక్కడో పట్టు తప్పింది.. అందరూ సీనియర్ నటులే.. అందరూ అవలీలగా చేసుకు వెళ్లిపోయారు. రామ్ కూడా బాగానే చేశాడు గానీ.. నటనలో వేరియేషన్ చూపించుకుంటూ వెళ్లాలి.

జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, తమిళ హీరో విక్రమ్ లాంటి వాళ్లు.. పాత్ర ఔచిత్యాన్ని బట్టి దానికి  ఒక నేరేషన్, సెపరేట్ డిక్షన్, మాడ్యులేషన్ ( డైలాగ్ డెలివరీ ) ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు..అంటే రామ్ యాక్టింగ్ ఈజీగానే చేస్తాడు. అంటే కొత్త సినిమా అయినా..రామ్ నటన పాత సినిమా తరహాలోనే డైలాగ్ డెలివరీ ఉండటం వల్ల.. అంటే నేనూ శైలజ, ‘ఉన్నది ఒకటే జిందగీ’ తరహాలా లాగించేశాడు.

ఫైనల్‌గా చెప్పొచ్చేదేమిటంటే…

అందమైన సినిమా.. చక్కని కుటుంబ సమేతంగా చూడతగిన సినిమా.. కథలో వేగం తగ్గడంతో కొంచెం ప్రేక్షకులకు దూరమైందనే చెప్పాలి. అయితే ఎన్నో చెత్త సినిమాలు చూసే బదులు కుటుంబమంతా సరదాగా కలిసి వెళ్లి చూసి రావచ్చు..

నటీనటులు: రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రణీత, ప్రకాష్‌రాజ్‌, మహేష్‌, సితార, వి.జయప్రకాష్‌, పోసాని కృష్ణమురళి, సత్య తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి చక్రవర్తి
ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
నిర్మాత:
శిరీష్‌, లక్ష్మణ్‌
సమర్పణ: దిల్‌రాజు
దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన

                                 – శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -