‘యాత్ర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్! హిట్టా? ఫట్టా?

yatra movie review
- Advertisement -

రైతులకి ఏంకావాలి, పేదల ప్రజల గుండె చప్పుళ్ళు , ప్రజలు సమస్యలు రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా తెలుసుకుని అధికారం లోకి వచ్చిన తరువాత దానికి అనుగుణంగా అవసరమైన పధకాలు , కార్యక్రమాలు చేపట్టి ప్రజా హృదయంలో స్తుస్థిరా స్థానాన్ని సంపాదించుకున్నాడు మహానాయకుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి.

వైఎస్ అభిమానులకి మరో జ్ఞాపకం..

ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన యాత్ర మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గ విడుదలైంది. డాక్టర్ వైఎస్ పాత్రలో మళయాళ మెగాస్టార్ ముమ్ముట్టి నటించాడు. మమ్ముట్టిని సినిమా స్క్రీన్ మీద చూస్తుంటే వైఎస్ మళ్ళీ వచ్చాడా అన్నట్లుగా వైఎస్ పాత్రలో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో డాక్టర్ వైఎస్ పాత్రతో పాటు ఆయా పాత్రలను తీర్చిదిద్దిన ఘనత మహీ వి రాఘవ్ కే దక్కుతుంది.

అలాగే రాజారెడ్డి కేరక్టర్ లో జగపతి బాబు నటన సూపర్బ్. ఒకానొక దశలో ముమ్ముట్టి, జగపతి బాబు ఒకరికొకరు పోటీ పడి నటించారు. చేవెళ్ల చెల్లెమ్మ అని ఆప్యాయంగా సబితా ఇంద్రారెడ్డిని డాక్టర్ వైఎస్ పిలుస్తూ ఆమెకు హోమ్ శాఖ కూడా ఇచ్చారు. ఏపీలో తొలి మహిళా హోమ్ మంత్రిగా సబితా రికార్డుకెక్కారు. ఆ పాత్రలో సుహాసిని చక్కగా నటించారు.

రావు రమేష్, వంటి నటులు అద్భుతంగా నటించారు. ఇక సినిమాకు మ్యూజిక్ ఎక్కడికక్కడ చక్కగా అమరింది. ఎక్కడ ఎలా సెట్ అవ్వాలో అలా అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. పెంచల్ దాస్ పాడిన ఓపాట సినిమాకు హైలెట్.

డాక్టర్ వైఎస్ మరణం తర్వాత బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ అందరిని కట్టిపడేస్తుంది. అందరికీ తెల్సిన కథను రొటీన్ కి భిన్నంగా కొత్తదనం చూపిస్తూ స్క్రీన్ ప్లే నడిపించి తీరు సూపర్బ్. ఇంకా చెప్పాలంటే ఎక్కడా రాజకీయ రంగు అంటకుండా, ఓ మహనీయుడు జీవితం ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దారు.

ప్రజల సమస్యలు ఎలా అర్ధం చేసుకున్నారో, ప్రజల మనిషిగా ఎలా ఎదిగారో చాలా చక్కగా చూపించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2003లో డాక్టర్ వైఎస్ చేపట్టిన పాదయాత్ర ఎలా సాగించారు, ఎంతమంది ప్రజలతో మమేకం అయ్యారు , రైతు సమస్యలను ఏ కోణంలో చూసారు , రైతే రాజు అనే దానికి ఎలాంటి అర్ధం ఇచ్చారు.

ఇక క్లైమాక్స్ లో హెలికాఫ్టర్ ప్రమాదంలో డాక్టర్ వైఎస్ మరణించిన తీరుని ఆవిష్కరించిన తీరు కళ్ళు చెమరుస్తాయి. వాతావరణం బాగోలేకపోయినా, ప్రమాదం అని తెల్సినా కూడా తనకోసం వెయిట్ చేసే ప్రజలను కలుసుకోవాలని బయలుదేరడం, హెలికాఫ్టర్ కూలిపోవడం వంటి ఘటనలను నేచురల్ గా తీశారు.

డాక్టర్ వైఎస్ మరణంతో ఎంతమంది అభిమానులు,,కార్యకర్తలు ప్రాణాలు వదిలారో ఇవన్నీ నేచురల్ గా చూపించారు. డాక్టర్ వైఎస్ అభిమానులకు, అనుచరులకు నిజంగా ఈ మూవీ ఓ చక్కటి జ్ఞాపకం అని చెప్పాలి. జయహో రాజన్న జయహో..

సంబంధిత వార్తలు 

యాత్ర మూవీ ట్విట్టర్ రివ్యూ!

మన గడప తొక్కి సాయం అడిగిన ఆడ బిడ్డతో రాజకీయం ఏంట్రా? యాత్ర ప్రీమియర్స్ షో టాక్?

‘యాత్ర’ ప్రీమియర్ షో తొలి టికెట్‌ ధర.. ఎంతో తెలుసా!?

- Advertisement -