రెండ్రోజులు టైం ఇస్తున్నా.. లేదంటే.. : యూట్యూబ్‌ చానళ్లకు గీతామాధురి ఘాటు వార్నింగ్‌!

Geetha-Madhuri6
- Advertisement -

Geetha Madhuri Ins

హైదరాబాద్: తెలుగు సినీ రంగంలో గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమేకాక.. ఇటీవల బిగ్ బాస్2 లో పాల్గొని..  రన్నరప్‌‌గా నిలిచిన ప్రముఖ సింగర్ గీతా మాధురి యూట్యూబ్ చానళ్లపై విరుచుకుపడ్డారు.  తాజాగా కొన్ని యూట్యూబ్ చానళ్లకు ఆమె సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు తనపై సాగిస్తోన్న నెగిటివ్ ప్రచారాన్ని భరిస్తూ వస్తున్నానని, ఇకమీదట ఊరుకునేది లేదని హెచ్చరించారు.

- Advertisement -

సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో గీతా మాధురి వ్యాఖ్యలు, ఆమె ఘాటు వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది.  ‘‘నా గురించి ఫేక్ వీడియోలు, వార్తలు యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు.. ఆ చానళ్లపై నేను మరో రెండు రోజుల్లో లీగల్‌గా ఫిర్యాదు చేయబోతున్నా.. ’’ అంటూ గీత మాదిరి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి.

అంతేకాదు,  ‘‘ఆ వీడియోలను తొలగించడానికి వారికి కొంత సమయం కూడా ఇస్తున్నా.. నేను కంప్లైంట్ చేయబోయే ముందే ఆ వీడియోలు తొలగించండి. నాపై నెగిటివ్ ప్రచారం మానండి..’’ అంటూ గీతా మాధురి హెచ్చరించింది.

‘‘ఇలాంటి ట్రోలింగ్ వలన మహా అయితే ఒక రోజు బాధపడతానేమో.. ఆ తరువాతైనా సంతోషం, ప్రశాంతత నాకు దక్కుతాయి..’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సింగర్ గీత మాధురి.

- Advertisement -