స్టార్ హీరో, హీరోయిన్ మధ్య ఆస్తి వివాదం… మొదటి భార్యకు దగ్గరైన హీరో!

- Advertisement -

హాలీవుడ్ స్టార్స్ ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్…. చాలా ఏళ్ల పాటు హాలీవుడ్లో ఆదర్శ దంపతుల్లా ఓ వెలుగు వెలిగారు. ఆరుగురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. హాలీవుడ్లో ఇతర సెలబ్రిల మాదిరిగానే వీరి సంసారం కూడా మధ్యలోనే వివిధ కారణాలతో ముక్కైలైంది. 2016లో ఈ స్టార్ కపుల్ విడిపోగా విడాకులు విషయంలో ఇంకా ఫైనల్ సెటిల్మెంట్ కాలేదు. ఇద్దరి మధ్య ఆస్తుల పంపకం, పిల్లల విషయంలో సయోధ్య కుదరక పోవడమే ఇందుకు కారణం.

పిల్లల సంరక్షణ విషయంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదు. పిల్లల బాగోగులను తానే చూసుకుంటానని జోలీ వాదిస్తుండగా, వారు ఇద్దరి సంరక్షణలో ఉండాలని బ్రాడ్ పిట్ కోరుతున్నాడు.  ఆస్తుల పంపకం విషయంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌లో ఇద్దరూ కలిసి కొన్న వైన్ యార్డ్ అమ్మేసి తనకు డబ్బు ఇవ్వాలని ఏంజెలీనా కోరుతుండగా, బ్రాడ్ పిట్ ఈ ఆస్తిని అమ్మడానికి ఇష్టపడటం లేదట.

- Advertisement -

ఏంజెలీనాతో విడిపోయిన తర్వాత బ్రాడ్ ఫిట్ తన మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్‌కు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. త్వరలోనే వీరు బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  జెన్నిఫర్ ఆనిస్టిన్ వయసు 49 సంవత్సరాలు. రెండు వివాహాలైనా ఆమెకు ఇంత వరకు పిల్లలు లేరు. ప్రస్తుతం బ్రాడ్ పిట్ కు దగ్గరైన ఆమె తల్లికవాలని ఉవ్విల్లూరుతోంది. సహజ పద్దతితో వీలుకాకుండా ఐవీఎఫ్ పద్దతిలో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది.

బ్రాడ్ పిట్ కు దగ్గరైన జెన్నిఫర్ ఆనిస్టిన్‌కు అభిమానుల నుండి సైతం మద్దతు లభిస్తోంది. త్వరలోనే ఆమె నుండి బిడ్డను ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  బ్రాడ్ పిట్‌తో విడిపోయిన తర్వాత ఏజెలీనా జోలీ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో డేటింగ్ మొదలు పెట్టినట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తన పిల్లల పెంపకంపైనే ఆమె పూర్తి దృష్టి పెట్టారు.

 

- Advertisement -