అవెంజర్స్‌ ఎండ్ గేమ్ రికార్డ్స్! రెండు రోజుల్లో 2,130 కోట్లు!

1:30 pm, Sat, 27 April 19
avenger end game collections

ఇండియా: ప్రస్తుతం ప్రపంచమంతా అవెంజర్స్‌ ఫీవర్స్‌ కనిపిస్తుంది. ఎన్నికలు, ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్నా, భారత్‌లోనూ ఈ ఫీవర్‌ గట్టిగానే కనిపిస్తుంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌, థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూ లైన్లు చూస్తుంటే ఈ విషయం అర్థమౌతుంది. ఇతంటి భారీ అంచనాల మధ్య శుక్రవారం అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక సినిమా విషయానికొస్తే.. విశ్వాన్ని సర్వనాశనం చేసి తన ఆధీనంలో ఉండే కొత్త ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు థానోస్ ప్రయత్నాలు చేస్తుంటాడు. థానోస్‌ను ఎదుర్కొనేందుకు చేసిన పోరాటంలో కొంత మంది బతికి బయటపడుతారు. అలా బయటపడిన ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థోర్, కెప్టెన్ మార్వెల్, నెబ్యులా లాంటి వారు మిగితా అవెంజర్స్‌ను కూడగడుతారు.

థానోస్‌ను ఎదురించాలంటే అతడిని శక్తిని హరించే ఆరు రత్నాలు సంపాదించాలని ప్లాన్ వేస్తారు. సర్వైవర్స్ మిగితా అవెంజర్స్‌ను ఎలా కూడగట్టారు, ఆ ఆరు రత్నాలను సంపాదించడానికి ఏమి చేశారు. థానోస్‌ను ఎదురించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు. చివరకు రత్నాలు అవెంజర్స్ చేతికి చిక్కాయా, లేదా థానోస్‌‌ను ఎలా అంతమొందించారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఇదే ఇతి వృతంతో డైరెక్టర్స్ సినిమాను భావోద్వేగంగా , సినిమా మొత్తం ఆసక్తికరంగా తెరకెక్కించారు.

ఈ సినిమా కోసం ఉపయోగిచిన గ్రాఫిక్స్ తెరమీద మ్యాజిక్‌గా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే యాక్షన్ సీన్లు, ఉపయోగించిన టెక్నాలజీ సినిమాని మరో లెవెల్ కి తీసుకుపోయింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అవెంజర్స్‌ సిరీస్‌లో కనిపించిన ప్రతీ సూపర్ హీరోను క్లైమాక్స్‌లో భాగం చేసి అభిమానులకు మరింత కనువిందు చేశారు చిత్రయూనిట్.

ఇదివరకు ఎప్పుడూ లేనంతగా హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ది ఎండ్ గేమ్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున కలెక్షన్లు కుమ్మేస్తోంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1,186 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన ఎవెంజర్స్ ఎండ్ గేమ్ కేవలం మొదటి రెండు రోజుల్లోనే రూ.2,130 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇండియా సహా 46 దేశాల్లో విడుదలైన ఈ చిత్రం , విడుదలైన అన్ని చోట్ల పాత రికార్డ్స్ ని మట్టికరిపిస్తూ , కొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఇక అతిపెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్ అయిన చైనాలో అవెంజర్స్ ఎండ్ గేమ్ మొదటి రోజు 747 కోట్లు రాబట్టింది. మొత్తం మీద రెండు రోజుల్లో ఒక్క చైనా బాక్స్ ఆఫీస్ వద్దే ఏకంగా రూ.1,075 కోట్లు రాబట్టింది.