హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌పై పబ్లిక్‌గా చెయ్యేసిన డైరెక్టర్.. షాక్ తిన్న హీరోయిన్!

6:25 pm, Tue, 4 September 18
Dakota Jackson susperia shooting movements

వాషింగ్టన్: సినీ రంగంలో ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి ఇటీవలి కాలంలో పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై అటు హాలీవుడ్ మాత్రమే కాదు, మన దేశంలోని బాలీవుడ్, టాలీవుడ్ నటీమణులెందరో నోరు విప్పారు కూడా.  తాజాగా హాలీవుడ్‌లో మళ్లీ ఇలాంటి హాట్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది.

ఓ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు పబ్లిక్‌గా ఓ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌పై  చేయి వేయడం సంచ‌ల‌నంగా మారింది.  హాలీవుడ్ నటి డకోటా జాక్సన్ త‌ను న‌టించిన ‘సస్పీరియా’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వెనిస్ నగరంలో ఇటీవల జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొంది.  ఆ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు  లూకా గౌడాంగ్‌నినో ఆమె బ్రెస్ట్‌పై చేయి వేసిన‌ట్లు ఫోటోలు సోష‌ల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఉన్నట్లుండి దర్శకుడు అలా చేయడంతో హీరోయిన్ డకోటా జాక్సన్ షాక్ తిందట.  కానీ అంతలోనే సర్దుకుని చిరునవ్వులు చిందిస్తూ అందరి దృష్టిని ఆ విషయంపైనుంచి మళ్లించిందట.  కానీ చూసిన వాళ్లు మాత్రం షాక్ అయ్యారట.  ఫొటో గ్రాఫర్లకు కూడా చేతినిండా పని దొరికిందనుకున్నారో ఏమో.. క్షణాల్లో ఆ సీన్‌ని తమ కెమెరాల్లో బంధించేశారు.

ఆ తరువాత ఈ ఘటనపై వివ‌ర‌ణ కూడా ఇచ్చింది హీరోయిన్ డకోటా జాక్సన్. అసలేం జరిగిందంటే.. రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు పోజులు ఇస్తున్న సమయంలో తన డ్రస్ కిందికి జారిందని, అది గమనించిన దర్శకుడు లూకా గౌడాంగ్‌నినో తన బ్రెస్ట్‌కు చేయి అడ్డం పెట్టాడని,  అంతేగానీ అతడు చేత్తో టచ్ చేయలేదని, కానీ ఫోటోల‌లో ట‌చ్ చేసిన‌ట్లు క‌నిపిస్తోందని పేర్కొంది.

తన పరువు కాపాడేందుకే దర్శకుడు లూకా గౌడాంగ్‌నినో అలా చేశాడు తప్ప ఆ చర్య వెనుక మరో తప్పుడు ఉద్దేశం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఈ విషయన్ని నటి డకోటాయే చాలా లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది కదూ.. మరి ఇంకెందుకు గొడవ!