షాకింగ్: హీరోయిన్ నగ్న ఫొటోలు, వీడియోలు హ్యాక్.. ఆపైన బ్లాక్ మెయిలింగ్!

3:21 pm, Tue, 18 June 19
hollywood-actress-bella-thorne

సాంకేతికత పెరిగే కొద్దీ హ్యాకర్ల నుంచి భద్రత లేకుండా పోతోంది. సినీ తారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను హ్యాక్ చేసి బెదిరింపులకు పాల్పడటం వారికి సర్వ సాధారణంగా మారింది.

తాజాగా హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్‌ జీవితంలో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలను హ్యాక్ చేసిన కొందరు వాటిని బయటపెడతామని బెదిరిస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు.

జూన్ 15వ తేదీన బెల్లా థ్రోన్‌కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసిన ఆగంతకులు ఆమె నగ్న ఫొటోలను, వీడియోలను సంగ్రహించారు. ఆ విషయం తెలుపుతూ ఆమెతో బేరసారాలకు దిగారు. కాదంటే ఆ ఫొటోలను ఇంటర్నెట్, సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తామంటూ బెదిరించారు.

తొలుత భయపడిన బెల్లా థ్రోన్ ఆ తరువాత ఆలోచించింది. అలాంటి వారికి ఒకసారి లొంగితే, భవిష్యత్తులోనూ ఆ ముప్పు తప్పదని భావించింది.

తన ఫొటోలను తానే బయటపెట్టి…

అందుకే బెల్లా ఓ డేరింగ్ స్టెప్ తీసుకుంది. తన నగ్న ఫొటోలను తానే బయటపెట్టేసింది. అంతేకాకుండా, ‘‘పోలీసులు మీ ఇంటికొస్తారు, మీ అంతు చూస్తారు..’’ అంటూ హ్యాకర్లను తిరిగి బెదిరించింది. దీంతో ఆమె నుంచి ఏదో ఆశించిబోయిన హ్యాకర్లు షాక్ తిన్నారు.

‘‘వారి బెదిరింపులకు నేను విసిగిపోయాను. వాళ్లు నా నగ్న ఫొటోలను మాత్రమే కాదు, మరికొంతమంది హీరోయిన్ల ఫొటోలను కూడా సేకరించి ఇలాగే బెదిరిస్తున్నారని నాకు అర్థమైంది. అందుకే వారికి బుద్ధి చెప్పాలని భావించాను. నా నగ్న ఫొటోలను నేనే బయటపెట్టడం ద్వారా వాళ్లకి అలా బెదిరించే చాన్స్ లేకుండా చేశాను. ఆ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను..’’ అని వివరించింది.

అంతేకాదు, ‘‘ ఆ హ్యాకర్లు టీనేజర్లని తెలుసుకోవడంతో వారిపై జాలి కూడా కలిగింది. జీవితం అంటే ఏమిటో పూర్తిగా తెలియని వారివి పిల్ల చేష్టలుగా భావించా. వారిపై ఫిర్యాదు చేస్తే వారి జీవితం నాశనం అవుతుందనే ఉద్దేశంతో వారిని క్షమించాను. ఈ ఘటనను నేను రాసే పుస్తకంలో కూడా పొందుపరుస్తాను..’’ అని బెల్లా థోర్న్ పేర్కొంది.