రోడ్డున పడ్డ జాకీ చాన్ కూతురు! వీధుల్లో, బ్రిడ్జి కింద జీవనం… అసలేమైంది?

- Advertisement -

జాకీ చాన్ పేరు వినగానే మనకు హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆయన సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయల సంపాదిస్తుంటారు. మరి అలాంటి వరల్డ్ ఫేమస్ స్టార్ కుటుంబం, పిల్లలు ఏస్థాయిలో ఉంటారు అంటే…. ఉన్నతమైన స్థానంలో, విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ ఉంటారని అంతా అనుకుంటారు. కానీ తాజాగా జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్‌ విడుదల చేసిన వీడియో చూస్తే మీ మనసు చలించక మానదు. దయనీయమైన స్థితిలో హాంకాంగ్ వీధుల్లో బ్రిడ్జికింద ఆమె జీవిస్తోంది. తన పరిస్థితి వెల్లడిస్తూ ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జాకీ చాన్ కూతురు ఎట్టా ఎన్‌ ఉండటానికి ఇల్లు కూడా లేని దయనీయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆమె హాంకాంగ్ వీధుల్లో జీవితం కొనసాగిస్తోంది. తన గర్ల్‌ఫ్రెండ్ ఆండీతో కలిసి ఓ బ్రిడ్జి కింద జీవిస్తున్నట్లు ఎట్టా ఎన్‌ వెల్లడించారు. ఆమె వయసు 18 సంవత్సరాలు మాత్రమే. తాను ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం తన తల్లిదండ్రులే అని ఎట్టా ఎన్‌ ఆరోపించారు.

- Advertisement -

నా తల్లిదండ్రులకు ‘హోమోఫోపిక్ పేరెంట్స్’ (స్వలింగ సంప్కకులను అసహ్యించుకునే వారు). అందుకే వారు ఆండీతో నా రిలేషన్ అంగీకరించడం లేదు. అందుకే మేము నెల రోజులుగా ఆశ్రయం లేని స్థితిలో ఉన్నాము అని ఇట్టా తెలిపారు.  ఆశ్రయం లేక పోవడం వల్ల మేము బ్రిడ్జి కిందే పడుకుంటున్నాం. ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మేము పోలీసులను ఆశ్రయించాం, ఫుడ్ బ్యాంకులను ఆశ్రయించాం, ఎల్‌జిటిక్యూ కమ్యూనిటీ షెల్టర్లను ఆశ్రయించాం… ఎవరూ మాకు సహాయం చేయడం లేదు అని ఎట్టా ఎన్‌ తెలిపారు.

జాకీ చాన్- మాజీ బ్యూటీ క్వీన్ ఎలైన్ ఎన్ సంతానమే ఎట్టా ఎన్‌. ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నపుడు ఎట్టా ఎన్ జన్మిచారు. అయితే వీరిద్దరూ తమ కూతురు స్విలింగ సంపర్కురాలిగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తమ కూతురు విషయంపై స్పందించడానికి వారు ఇష్ట పడటం లేదు.

- Advertisement -