మందుకొట్టి మ్యాచ్ మధ్యలో రచ్చ చేసిన యాంకర్ ప్రశాంతి!

4:41 pm, Mon, 22 April 19
Anchor Prasanthi Latest News, Uppal Stadium Latest News, Newsxpressonline

హైదరాబాద్: ఐపీఎల్‌ ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ రెండు టీమ్స్ లోను స్టార్ ప్లేయర్స్ చాలామంది ఉండటంతో ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు భాగ్యనగర వాసులు పెద్ద ఎత్తున పోటెత్తారు.

వేలాదిమందితో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే ఇదే మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన కొందరు యువతీ యువకులు మద్యం మత్తులో స్టేడియంలో నానా హంగామా చేశారు. పక్కనున్న వారితో అసభ్యంగా ప్రవర్తించి అక్కడి వాతావరణాన్ని మార్చేశారు. మ్యాచ్ ని ఎంజాయ్ చేద్దాం అని వచ్చిన వారికి విసుగు తెప్పించారు. మితిమీరిన వారి ప్రవర్తనను తట్టుకోలేని ఓ ప్రేక్షకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: అభిమాని చిరకాలకోరిక నెరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి..!

పూర్తి వివరాల్లోకి వెళ్తే… సన్ రైజర్స్ హైదరాబాద్, కొలకత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో టీవీ యాంకర్ ప్రశాంతి రచ్చరచ్చ చేసింది. తన స్నేహితులు ప్రియ, పూర్ణిమ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్ లతో కలసి మ్యాచ్ చూసేందుకు ఆమె వచ్చింది.

వీరు స్టేడియంలోకి ప్రవేశించే ముందే పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారు. ఆ తరువాత వీరందరూ కలిసి రెచ్చిపోయారు. వీరి చేష్టలు గ్యాలరీలోని ఇతర ప్రేక్షకులకు వెగటు పుట్టించాయి.

పూర్తిగా మైకంలో ఉన్న ఓ యువతి అసభ్యంగా ప్రవర్తించింది. విరిపక్కనే ఉన్న సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో వీరు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సీసీ టీవీ ఫూటేజిని పరిశీలించిన పోలీసులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు. కాసేపట్లో ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం ఇందుకు సంబంధించిన వీడియో రాత్రి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.