హైకోర్టును ఆశ్రయించిన హీరో విశాల్

10:46 am, Tue, 30 April 19
Vishal Latest News, Chennai Latest News , Newsxpressonline

చెన్నై: నిర్మాతల మండలికి ప్రత్యేక అధికారిని నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హీరో విశాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రభుత్వం నిర్మాతల మండలిని తన చేతుల్లోకి తీసుకుని ఎన్ శేఖర్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించిన నేపథ్యంలో విశాల్ కోర్టుకెక్కాడు.

ప్రస్తుతం ఉన్న కార్యవర్గం కాల పరిమితి పూర్తయిందని గుర్తు చేసిన ఆయన, ఆదాయ, వ్యయాలను సభ్యుల ముందు పెట్టేందుకు 1న సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేశామని, అప్పుడే తదుపరి ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని, ఈ దశలో ప్రత్యేక అధికారి అవసరం లేదని కోర్టుకు తెలిపారు.

తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని విశాల్ కోరగా, అందుకు అంగీకరించిన న్యాయమూర్తి, మంగళవారం అంటే.. ఈరోజు వాదనలు వింటామని వెల్లడించారు. దీంతో విశాల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.

చదవండి:  చెబితే వినరేంటి?: కేఏ పాల్ రేంజ్ ఏమిటో తెలుసా?