కాజల్ అగర్వాల్‌కు అతడంటే పిచ్చి అట! ఎవరతడు? ఏమా కథ?

1:28 pm, Tue, 30 April 19
Kajal Aggerwal Latest Updates, Cricketer Rohit Sharma News, Newsxpressonline

హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలోని ముద్దుగుమ్మల్లో చాలామంది ఇతర ప్రొఫెషన్లలో ఉన్న ఫేమస్ పర్సన్స్‌పై ఇష్టాన్ని చూపిస్తుంటారు. అంతేకాకుండా, వారితో కలిసి వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తుంటారు. తరచూ మనం చూసే వాణిజ్య ప్రకటనల్లో ఒక హీరో కానీ, ఒక హీరోయిన్‌తో కలిసి యాడ్లో నటిస్తారు.

ఈ మధ్య కాలంలో గ్రౌండ్‌ను వదిలి వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ చాలా మంది క్రికెటర్లు ఆ బ్రాండ్ క్రేజ్‌ని ఒక రేంజ్‌లోకి తీసుకెళ్లారు. అంతేకాదు, అలా వాణిజ్య ప్రకటనల్లో నటించిన సెలెబ్రెటీలు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. దానికి ఉదాహరణ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. 

ఇక టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ.. కాజల్ అగర్వాల్.  ఈమెకు కూడా ఒక క్రికెటర్ అంటే చాలా పిచ్చి అట.. అతనెవరో కాదు రోహిత్ శర్మ. ఇతగాడి బ్యాటింగ్ స్టయిల్ అంటే కాజల్‌కు పిచ్చట.

అతడి గురించి కాజల్ ఇటీవల మాట్లాడుతూ.. 200 పరుగులు తీసేవరకు అలసిపోడు. ఇండియా క్రికెట్ టీమ్‌కు ఈయన బెస్ట్ బ్యాట్ మ్యాన్ అంటూ రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించింది.

ఇక రోహిత్ మైదానంలో బ్యాటింగ్ చేస్తుంటే తాను కళ్ళు ఆర్పకుండా చూస్తుండిపోతానని కూడా కాజల్ వ్యాఖ్యానించింది. దీన్ని బట్టి చూస్తోంటే.. మన కాజల్ అగర్వాల్‌కు కూడా రోహిత్ శర్మ అంటే అమితమైన ప్రేమ అని అర్థమవుతూనే ఉంది.

అయితే ఈ బ్యూటీ దురదృష్టం.. క్రికెటర్ రోహిత్ శర్మకు అల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది. ఇక తన చెల్లి నిషా అగర్వాల్‌కి కూడా ఎప్పుడో పెళ్లిచేసుకున్నా.. కాజల్ అగర్వాల్ మాత్రం సినిమాలు.. సినిమాలు అంటూ అలా ఉండిపోయింది.

మరోవైపు కాజల్ చెల్లెలు నిషా పిల్ల తల్లి కూడా అయింది. మరి సినిమాలకే అంకితమైపోయిన ఈ భామ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందనే ఒక ఆలోచన అందరిలోనూ మెదులుతోంది. మరి వారి ఆలోచనలకూ చెక్ పెట్టేలా కాజల్ త్వరలోనే తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదా చూడాలి.

చదవండి:  కొత్త సినిమాలు గురూ! ఓటమి నుంచి.. విజయం వైపు పయనించే.. మజిలీ, జెర్సీ, చిత్రలహరి