కేజీఎఫ్ చాప్టర్-2లో సంజయ్ దత్!

5:24 pm, Wed, 13 March 19
Sanjay Dutt in KGF chapter 2!, Newsxpressonline

బెంగుళూరు: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్’ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టింది. కన్నడ సినీ చరిత్రలో ఏ చిత్రం కూడా ఇప్పటి వరకూ కనీసం రూ.100 కోట్లు కూడా దాటలేదు.

కానీ కేజీఎఫ్ చాఫ్టర్ 1 ఏకంగా రూ.200 కోట్లు రాబట్టింది. దీన్ని బట్టే యశ్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం హిందీలోనూ రూ.40 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.బాహుబలి, బాహుబలి-2, 2.0 చిత్రాల తరువాత హిందీలో రూ.40 కోట్లకు పైగా రాబట్టిన నాలుగవ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 1 కావడం విశేషం.

కేజీఎఫ్ ఛాప్టర్ 1 బ్లాక్‌బస్టర్ కావడంతో.. దీనికి సీక్వెల్‌ను మరింత భారీగా తీసే దిశగా అడుగులు పడుతున్నాయి. సెకండ్ పార్ట్‌లో రమ్యకృష్ణ, సంజయ్ దత్, ఫర్హాన్ అక్తర్, రవి శంకర్ లాంటి సీనియర్ నటీనటులు నటించనున్నారని సమాచారం.

దీంతో ఈ సినిమాకు తెలుగు, తమిళం, హిందీల్లోనూ మార్కెట్ పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఏ పాత్రలో నటిస్తారనే విషయమై క్లారిటీ లేదు. ఈ చిత్ర షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.