రాజశేఖర్ చిన్నకుమార్తెతో విజయ్ దేవరకొండ తమ్ముడు జోడి…

sivaatmika-anand-deverakonda
- Advertisement -

Vijay-Deverakonda-brother

హైదరాబాద్ :  అర్జున్‌‌రెడ్డితో వెలుగులోకి వచ్చిన  హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ  హీరోగా పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు.  హీరో విజయ్‌ దేవరకొండకి ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ వరుస హిట్లతో స్టార్ ఇమేజ్‌ వచ్చింది, దీంతో తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా తెరంగేట్రం చేయించేందుకు ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నారు.

- Advertisement -

అక్టోబర్‌ 10న షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా కథ తెలంగాణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు పలు షార్ట్‌ ఫిలింస్‌ తీసి, తానేంటో నిరూపించుకున్న కేవీఆర్‌ మహేంద్ర  దర్శకత్వం వహించబోతున్నారు.  దగ్గుబాటి సురేష్‌ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాకి మధుర శ్రీధర్‌, యష్‌ రంగినేనిలు నిర్మాతలుగా వ్యవహరింస్తున్నారు.

హీరో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక ఈ సినిమాతో హీరోయిన్‌‌గా పరిచయం కానుంది.

 

- Advertisement -