షాకింగ్: దేశంలోని నకిలీ కరెన్సీలో 56 శాతం.. రూ.2 వేల నోట్లు!

rs-2000-note-pm-modi
- Advertisement -

న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు, దేశంలోని నకిలీ నోట్లకు చెక్‌ పెట్టేందుకు అంటూ 2016, డీమోనిటైజేషన్ పేరుతో నవంబర్ 8న కేంద్రంలోని మోడీ సర్కారు హఠాత్తుగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడం, ఆ తరువాత కట్టుదిట్టమైన భద్రతా ఫీచర‍్లతో కూడిన రూ.2000 నోట్లను చలామణీలోకి తీసుకురావడం తెలిసిందే.

చదవండి: ఉరికి వేళాయె.. నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ

అయితే ఈ రూ.2 వేల నోటుకు సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే… దేశంలో ప్రస్తుతం హల్‌‌చల్‌ చేస్తున్న నకిలీ నోట్లలో సగానికిపైగా రూ.2000 నోట్లు ఉన్నాయట. ఈ నోట్లను చాలా సులభంగా కాపీ కొట్టొచ్చట.. నకిలీ నోట్లను ముద్రించవచ్చట. ఈ విషయాన్ని ఎన్‌సీఆర్‌బీ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో) డేటా చెబుతోంది.

56 శాతం అవే.. గుజరాత్ అడ్డాగా…

ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం రూ.2000 నోట్లు ఉన్నట్లు ఈ డేటా చెబుతోంది. అదీ ఎంత శాతం అంటే.. ప్రస్తుతం దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీ మొత్తంలో 56 శాతం రూ. 2వేల నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయట.

అంతేకాదు, గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో నకిలీ కరెన్సీ పట్టుబడటమేకాక, ఆ రాష్ట్రం నకిలీ కరెన్సీకి ఒక అడ్డాగా మారినట్లుగా కూడా ఈ ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడిస్తోంది.  

చదవండి: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాల్సిందే: సుబ్రహ్మణ్యస్వామి
- Advertisement -